Delta variant: జులైలో 90.9% ‘డెల్టా’

దేశ రాజధాని దిల్లీలో కరోనా వైరస్‌ జన్యుక్రమ పరిశీలనలో బయటపడిన వేరియంట్లలో డెల్టా రకం శాతం ఏప్రిల్‌-జులై మధ్య క్రమేపీ పెరిగింది. ల్యాబ్‌లకు పంపించిన

Updated : 10 Sep 2021 09:25 IST

దిల్లీలో పరిశీలించిన శాంపిళ్లలో ఈ రకమే అధికం

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కరోనా వైరస్‌ జన్యుక్రమ పరిశీలనలో బయటపడిన వేరియంట్లలో డెల్టా రకం శాతం ఏప్రిల్‌-జులై మధ్య క్రమేపీ పెరిగింది. ల్యాబ్‌లకు పంపించిన శాంపిళ్లలో.. ఏప్రిల్‌లో 54% డెల్టా రకం బయపడగా.. జులైలో ఏకంగా ఈ వేరియంట్‌ 90.9 శాతానికి పెరిగింది. ఈమేరకు ఇటీవల నిర్వహించిన దిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ సమావేశంలో అధికారికంగా సమాచారాన్ని వెల్లడించారు. ఏప్రిల్‌లో పరీక్షించిన శాంపిళ్లలో 12.1% ఉన్న ఆల్ఫా రకం జులై నెలలో 2.3 శాతానికి తగ్గింది. మిగిలిన అన్ని వేరియంట్లు ఏప్రిల్‌లో 33.9% ఉండగా.. జులై సరికి 6.8%కి తగ్గాయి. మే, జూన్‌ నెలల్లో పరిశీలించిన శాంపిళ్లలో డెల్టా రకం వరుసగా 81.6%, 88.8% ఉన్నట్లు తేలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని