వయసు ఏడాది.. ఆదాయం రూ.75 వేలు

ఏడాది వయసున్న చిన్నారి ఓ వింత కొలువుతో నెలకు రూ. 75 వేలు సంపాదిస్తున్నాడు. పలు ప్రాంతాల్లో పర్యటించడమే ఆ చిన్నారి చేస్తున్న పని. అమెరికాకు చెందిన బేబీ బ్రిగ్స్‌ ఇప్పటికే 45 సార్లు విమాన ప్రయాణం చేశాడు.

Published : 22 Oct 2021 07:40 IST

వాషింగ్టన్‌: ఏడాది వయసున్న చిన్నారి ఓ వింత కొలువుతో నెలకు రూ. 75 వేలు సంపాదిస్తున్నాడు. పలు ప్రాంతాల్లో పర్యటించడమే ఆ చిన్నారి చేస్తున్న పని. అమెరికాకు చెందిన బేబీ బ్రిగ్స్‌ ఇప్పటికే 45 సార్లు విమాన ప్రయాణం చేశాడు. ఆ దేశంలోని 16 రాష్ట్రాలను చుట్టొచ్చాడు. అలస్కా, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, ఉతాల్లోని పార్కులు, బీచ్‌ల్లోనూ తిరిగాడు. అసలు దీనికి డబ్బులెలా ఇస్తారని ఆలోచిస్తున్నారా? చిన్నారితో వివిధ ప్రాంతాలు చుట్టి.. ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం బ్రిగ్స్‌ తల్లి జెస్‌ పని. దీనికి డబ్బులు కూడా చెల్లిస్తారు. ఇలా సగటున నెలకు రూ.75 వేలకుపైనే ఆదాయం వస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రిగ్స్‌కు 30 వేల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని