Debt: రూ.28 అప్పు తీర్చేందుకు దేశాలు దాటొచ్చి...

వేల కోట్ల రూపాయల అప్పును ఎగవేసి.. విదేశాలకు వెళ్లిపోతున్న వారి గురించి వింటూనే ఉన్నాం. అలాంటి ఈ కాలంలోనూ రూ. 28 అప్పును చెల్లించడం కోసం విదేశాల నుంచి భారత్‌కు వచ్చారు ఓ వ్యక్తి. 68 ఏళ్ల తర్వాత ...

Published : 05 Dec 2021 07:19 IST

వేల కోట్ల రూపాయల అప్పును ఎగవేసి.. విదేశాలకు వెళ్లిపోతున్న వారి గురించి వింటూనే ఉన్నాం. అలాంటి ఈ కాలంలోనూ రూ. 28 అప్పును చెల్లించడం కోసం విదేశాల నుంచి భారత్‌కు వచ్చారు ఓ వ్యక్తి. 68 ఏళ్ల తర్వాత అప్పును వడ్డీతో సహా తీర్చేశారు. హరియాణాలోని హిసార్‌లో ఈ ఘటన జరిగింది. బీఎస్‌ ఉప్పల్‌ బాల్యం అంతా హిసార్‌లోనే గడిచింది. ఆయన ఇంటి దగ్గర ‘దిల్లీ వాలా హల్వాయి’ అనే దుకాణం ఉండేది. అక్కడ ఎప్పుడూ లస్సీ తాగేవారు. 1954లో ఒకసారి అత్యవసరంగా హిసార్‌ను వీడాల్సి వచ్చింది. అప్పటికే ఆ దుకాణ యజమానికి బీఎస్‌ ఉప్పల్‌.. రూ.28 అప్పు ఉన్నారు. ఆ తర్వాత ఆయన నేవీలో చేరారు. హిసార్‌కు తిరిగి వెళ్లడం కుదరలేదు. పదవీ విరమణ తర్వాత కుమారుడితో కలిసి ఉప్పల్‌.. అమెరికాలో స్థిరపడ్డారు. ఎక్కడున్నా.. అప్పు తిరిగి ఇవ్వడం గురించే ఆలోచించేవారు. అప్పు తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకుని భారత్‌కు వచ్చారు. హిసార్‌కు వెళ్లి ఆ దుకాణం యజమానిని కలిశారు. ‘నేను మీ తాతకు రూ.28 అప్పు ఉన్నా. అది తిరిగి ఇవ్వడానికే ఇక్కడకు వచ్చా’ అని చెప్పారు. అప్పును వడ్డీతో సహా తీర్చేశారు బీఎస్‌ ఉప్పల్‌. దుకాణ యజమానికి రూ.10 వేలు ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని