Gyanvapi Masjid: శివలింగమే కాదు.. చాలా విగ్రహాలు ఉన్నాయి

కాశీలోని జ్ఞానవాపి మసీదు సర్వే తొలి నివేదికలో శివలింగం ఉన్నట్లు వెల్లడవ్వడంతో ఆ ప్రాంతాన్ని సీల్‌ చేయాలని వారణాసి కోర్టు ఆదేశించింది. అయితే ఇప్పుడు సర్వే నివేదికలోని

Updated : 20 May 2022 07:46 IST

‘జ్ఞానవాపి’ తొలి సర్వేలో ఆసక్తికర విషయాలు

వారణాసి (ఉత్తర్‌ప్రదేశ్‌): కాశీలోని జ్ఞానవాపి మసీదు సర్వే తొలి నివేదికలో శివలింగం ఉన్నట్లు వెల్లడవ్వడంతో ఆ ప్రాంతాన్ని సీల్‌ చేయాలని వారణాసి కోర్టు ఆదేశించింది. అయితే ఇప్పుడు సర్వే నివేదికలోని పలు అంశాలు బహిర్గతమయ్యాయి. నివేదిక ప్రకారం.. మసీదులోకి అడుగుపెట్టిన సర్వే బృందానికి పురాతన ఆలయ శిథిలాలు కనిపించాయి. పలు దేవతా విగ్రహాలు, కమలం నమూనాలు దర్శనమిచ్చాయి. రాతితో రూపొందించిన శేషనాగు శిల్పం, త్రిశూలం, ఢమరుకం, సింధూరి గుర్తులతో నాలుగు విగ్రహాలను కూడా బృందం గుర్తించింది.

‘‘మసీదులో పురాతన ఆలయ శిథిలాలు కనిపించాయి. అందులో దేవతా విగ్రహాలు, కమలం ఆకృతులు, మధ్యలో శేషనాగు, నాగఫణి శిల్పాలు ఉన్నాయి’’ అని నివేదిక పేర్కొంది. దీపారాధనకు సంబంధించిన గుర్తులు సైతం మసీదులో కనుగొన్నట్లు నివేదిక తయారు చేసిన అడ్వకేట్‌ కమిషనర్‌ అజయ్‌ మిశ్రా తెలిపారు. వీటితో పాటు మసీదు వెనక పడమటి గోడపై కళాత్మక నమూనాలు, రాతి పలకలు కనిపించాయని పేర్కొన్నారు. ఈ నివేదికలో అంశాలు బయటికి వెల్లడి కావడంతో మిశ్రాను కమిషనర్‌ బాధ్యతల నుంచి వారణాసి కోర్టు తప్పించిన సంగతి తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని