క్షయను గుర్తించే సరికొత్త పరీక్ష

క్షయ (టీబీ) వ్యాధిని గుర్తించే సరికొత్త చర్మ పరీక్ష విధానాన్ని త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ గురువారం వెల్లడించారు.

Published : 20 May 2022 05:57 IST

 త్వరలోనే అందుబాటులోకి.. : మంత్రి

దిల్లీ: క్షయ (టీబీ) వ్యాధిని గుర్తించే సరికొత్త చర్మ పరీక్ష విధానాన్ని త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ గురువారం వెల్లడించారు. తక్కువ ధరకు అందించే ఈ ‘భారత్‌లో తయారీ’ కిట్‌ ద్వారా అనేక ఇతర దేశాలకూ ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ‘స్టాప్‌ టీబీ పార్టనర్‌షిప్‌’ 35వ బోర్డు సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించిన ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ పరీక్షను ‘సీ-టీబీ’గా పిలుస్తారని చెప్పారు. క్షయ వ్యాధిని అంతమొందించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని