సిద్ధూ ఎన్నికల పోటీకి జైలుశిక్ష అడ్డుకాదు

ముప్పై ఏళ్ల కిందటి దాడి కేసులో గురువారం సుప్రీంకోర్టు ఏడాదిపాటు జైలుశిక్ష విధించిన కాంగ్రెస్‌ నాయకుడు నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూకు సమీప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండబోదని

Published : 20 May 2022 05:57 IST

న్యాయ నిపుణుల వెల్లడి

దిల్లీ: ముప్పై ఏళ్ల కిందటి దాడి కేసులో గురువారం సుప్రీంకోర్టు ఏడాదిపాటు జైలుశిక్ష విధించిన కాంగ్రెస్‌ నాయకుడు నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూకు సమీప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండబోదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ‘ఒకవేళ రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడుంటే, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్‌ 8 ప్రకారం.. శిక్ష పూర్తయిన కాలం నుంచి ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన అనర్హుడు అయ్యేవాడు’ అని న్యాయ నిపుణుడు, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌ పి.డి.టి.ఆచారి తెలిపారు. కేంద్ర న్యాయశాఖ మాజీ కార్యదర్శి పి.కె.మల్హోత్ర మాట్లాడుతూ.. క్రిమినల్‌ చర్యలకు పాల్పడి జైలుశిక్ష పడ్డ వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయడం గురించి ఎటువంటి సందిగ్ధత లేదన్నారు. పజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8 కింద మాదక ద్రవ్యాలు, మత్తుపదార్థాలు.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు.. అవినీతి నిరోధక చట్టం వంటి కేసుల్లో శిక్షపడ్డ వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించేందుకు పలు సూచనలు చేసినట్లు తెలిపారు. ఏడాది శిక్షపడ్డ సిద్ధూ విషయంలో అటువంటి ఆటంకాలేవీ లేవన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు