MSP: చెరకు రైతులకు తీపి కబురు.. గోధుమలపైనా మద్దతు ధర పెంపు

చెరకు రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. చెరకు పంట ఎఫ్‌ఆర్‌పీ ధరను పెంచింది. దీంతో పాటు గోధుమలు, ఆవాలు సహ ఆరు రకాల రబీ

Published : 08 Sep 2021 22:52 IST

దిల్లీ: చెరకు రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. చెరకు పంట ఎఫ్‌ఆర్‌పీ ధరను పెంచింది. దీంతో పాటు గోధుమలు, ఆవాలు సహ ఆరు రకాల రబీ పంటలకు కూడా మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయం తీసుకుంది. 

చెరకు పంటపై ఎఫ్‌ఆర్‌పీ ధరను రూ.5 పెంచింది. వచ్చే ఏడాది మార్కెట్‌ సీజన్‌లో దీంతో క్వింటాల్‌ చెరకును క్వింటాల్‌కు రూ.290 చొప్పున కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దీని వల్ల దాదాపు 5కోట్ల చెరకు రైతులకు ప్రయోజనం కలుగుతుందని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. 

ఇక 2022-23 మార్కెట్‌ సీజన్‌కు గానూ ఆరను రబీ పంటల మద్దతు ధర పెంపునకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. గోధుమలపై ఎంఎస్‌పీ ధర రూ.40 పెంచింది. ప్రస్తుత మార్కెట్‌ సీజన్‌లో క్వింటాల్‌ గోధుమలు రూ.1975 పలుకుతుండగా.. దాన్ని రూ.2015కు పెంచింది. ఇక బార్లీపై రూ.35 పెంచి క్వింటాల్‌ ధరను రూ.1635గా నిర్ణయించింది. ఆవాలు, మసూర్‌ దాల్‌పై అత్యధికంగా రూ.400 పెంచారు. దీంతో క్వింటాల్‌ ఆవాలు కనీస మద్దతు ధర రూ.5050, క్వింటాల్‌ మసూర్‌ ధర రూ.5500కు చేరింది. శనిగల మద్దతు ధరను రూ. 130 పెంచి క్వింటాల్ ధర రూ.5230, పొద్దుతిరుగుడు ధరను రూ.114 పెంచి క్వింటాల్‌ ధరను రూ.5441గా నిర్ణయించినట్లు కేంద్ర కేబినెట్‌ నేడు వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని