ofb: 15వ తేదీన ఓఎఫ్‌బీ స్థానంలో ఏడు కంపెనీలను ప్రారంభించనున్న ప్రభుత్వం.

ఆర్డ్‌నన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు కార్పొరేటైజేషన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అక్టోబర్‌ 15వ తేదీ ఏడు కంపెనీలను ప్రారంభించనుంది. ఈ విషయాన్ని

Published : 12 Oct 2021 23:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు కార్పొరేటైజేషన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అక్టోబర్‌ 15వ తేదీ ఏడు కంపెనీలను ప్రారంభించనుంది. ఈ విషయాన్ని కేంద్ర రక్షణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రభుత్వం ఇప్పటికే ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డ్‌ను కార్పొరేటీకరించిన విషయం తెలిసిందే. 

కొత్తగా ఏర్పడనున్న ఏడు కంపెనీలకు దాదాపు రూ.66 వేల కోట్లు విలువైన కాంట్రాక్టులను అప్పగించనుంది. మ్యూనిషన్‌ ఇండియా లిమిటెడ్‌, అవని ఆర్మర్డ్‌ వెహికల్స్‌ నిగమ్‌ లిమిటెడ్‌, అడ్వాన్స్‌డ్‌ వెపన్స్‌  అండ్‌ ఎక్విప్‌మెంట్‌ ఇండియా లిమిటెడ్‌, ట్రూప్‌ కంఫర్ట్స్‌ లిమిటెడ్‌, యంత్ర ఇండియా లిమిటెడ్‌, ఇండియా ఆప్టిల్‌ లిమిటెడ్‌, గ్లైడర్స్‌ ఇండియా లిమిటెడ్‌ పేర్లతో ఈ కంపెనీలను ఏర్పాటు చేస్తోంది. 

రక్షణ రంగంలో సంస్కరణలపై 2000 సంవత్సరం నుంచి ప్రభుత్వం నాలుగు కమిటీలను నియమించింది. వీటిల్లో మూడు కమీటీలు ఓఎఫ్‌బీ ప్రైవేటీకరణకు ఓటువేశాయి. ఒక కమిటీ వ్యతిరేకించింది. టీకేఎస్‌ నాయర్‌ కమిటీ (2000), విజయ్‌ కేల్కర్‌ కమిటీ (2005), వైస్‌ అడ్మిరల్‌ రామన్‌ పూరి కమిటీ (2015)లు కార్పొరేటీకరణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయి. కానీ, లెఫ్టినెంట్‌ జనరల్‌ డీబీ షెటక్కర్‌ కమిటీ మాత్రం వ్యతిరేకించింది. అన్ని ఫ్యాక్టరీలకు  తరచూ ఆడిటింగ్లు నిర్వహించి మెరుగు పర్చవచ్చని సూచించింది. దీంతో ప్రభుత్వం కార్పొరేటీకరణ వైపు మొగ్గింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని