అదీ కదా విశ్వాసమంటే..!

‘ఆస్తి కోసం సొంత అన్ననే చంపిన తమ్ముడు.. భారమయ్యాడని తండ్రిని హతమార్చిన తనయుడు’ ఇలాంటి వార్తలు ఎన్నో వింటాం. మనుషులకు స్వార్థం ఉంటుందేమోగానీ, మూగజీవాలను అది ఏమాత్రం వర్తించదని మరోసారి రుజువైంది...

Published : 07 May 2021 00:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఆస్తి కోసం సొంత అన్ననే చంపిన తమ్ముడు’.. ‘భారమయ్యాడని తండ్రిని హతమార్చిన తనయుడు’ ఇలాంటి వార్తలు ఎన్నో వింటాం. మనుషులకు స్వార్థం ఉంటుందేమోగానీ, మూగజీవాలను అది ఏమాత్రం వర్తించదని మరోసారి రుజువైంది. మూగజీవాల్లోనూ శునకానికి ప్రత్యేకత ఉంది. అది విశ్వాసానికి మారుపేరు. దానిని ఒక్కసారి చేరదీస్తే చాలు.. జీవితాంతం గుర్తుంచుకుంటుంది. అలాంటిది తన యజమానురాలే మరణిస్తే..!

వివరాల్లోకి వెళ్తే.. సూరత్‌లోని వేసు ప్రాంతంలో ఓ జైన సాధ్వి (100) కన్నుమూశారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆమెను స్థానికులు యాత్రగా తీసుకెళ్తున్నారు. ఇంతలో ఆమె పెంచుకున్న శునకం వచ్చి ఆ పాడె కింద నడవడం మొదలు పెట్టింది. వారంతా అదిల్చే ప్రయత్నం చేశారు. కానీ, అది వెనక్కిపోలేదు. దాదాపు 5 కిలోమీటర్లు వారితోపాటే నడిచి యజమానురాలిపై తనకున్న విశ్వాసాన్ని చాటుకుంది. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు శ్మశానంలో ఉంది. ఆ శునకం విశ్వాసానికి మెచ్చిన కొందరు తిరుగు ప్రయాణంలో కారులో ఎక్కించుకొని తిరిగి వేసు ప్రాంతంలో విడిచిపెట్టారట. ‘కుక్క విశ్వాసం గల జంతువు’ అని మరోసారి నిరూపితమైంది కదా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని