Gun Fire: అమెరికాలో మరోసారి కాల్పుల మోత

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. మిచిగాన్‌ రాష్ట్రంలోని డెట్రాయిట్‌ నగరంలో గల ఓ పాఠశాలలో దుండగుడు కాల్పులకు దిగాడు. 

Updated : 01 Dec 2021 04:03 IST

అమెరికా: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. మిచిగాన్‌ రాష్ట్రంలోని డెట్రాయిట్‌ నగరానికి  సమీపంలో ఉన్న ఓ పాఠశాలలో దుండగుడు కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. మరో ఆరుగురు గాయాలపాలైనట్లు చెబుతున్నారు. వీరిలో ఒక టీచరు ఉన్నట్లు అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి. సమాచారం అందుకున్న పోలీసుల బలగాలు వెంటనే ఆ పాఠశాలను చుట్టుముట్టాయి. అనంతరం 15 ఏళ్ల అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి హ్యాండ్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు 15-20 రౌండ్లు కాల్చినట్లు పోలీసులు చెప్పారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని