హాథ్రస్‌ ఘటన.. న్యాయం కోసం దిల్లీ వెళ్తాం!

హాథ్రస్‌ హత్యాచార బాధిత కుటుంబసభ్యులు తాము యూపీని వదిలి దిల్లీకి వెళ్లాలనుకుంటున్నట్లు తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యానే వారు హాథ్రస్‌ నుంచి దిల్లీకి వెళ్లాలనుకుంటున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా తమకు జరగాల్సిన

Updated : 22 Dec 2022 17:10 IST

లఖ్‌నవూ: భద్రతా కారణాల రీత్యా తాము యూపీ నుంచి దిల్లీకి వెళ్లాలనుకుంటున్నట్టు హాథ్రస్‌ హత్యాచార బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. అదేవిధంగా తమకు జరగాల్సిన న్యాయం కోసం అక్కడే పోరాటం కొనసాగిస్తామని శనివారం మీడియాకు వెల్లడించారు. బాధితురాలి సోదరుడు మాట్లాడుతూ.. ‘మేం హాథ్రస్‌ నుంచి దిల్లీకి వెళ్లాలనుకుంటున్నాం. న్యాయం కోసం అక్కడే పోరాడతాం. భద్రతా కారణాల వల్లే మేం అక్కడికి వెళ్లాలనుకుంటున్నాం’ అని తెలిపారు. బాధితుల తరపు న్యాయవాది సీమ కుష్వాహా మాట్లాడుతూ.. ‘హాథ్రస్‌ కేసు యూపీలో కాకుండా బయట విచారణ చేపట్టాలి’ అని కోరారు. కాగా, తాజాగా శనివారం సీబీఐ అధికారులు బాధిత కుటుంబసభ్యుల్ని దాదాపు ఐదు గంటల పాటు విచారించారు. గత సెప్టెంబర్‌ 14న యూపీలోని హాథ్రస్‌లో యువతిపై నలుగురు వ్యక్తులు హత్యాచారం ఘటన దేశంలో సంచలనం రేపిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని