సువేందు ఎన్నికపై దీదీ సవాల్‌.. విచారణ వాయిదా

నందిగ్రామ్‌లో భాజపా అభ్యర్థి సువేందు అధికారి ఎన్నికను సవాల్‌ చేస్తూ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కోల్‌కతా హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ....

Published : 18 Jun 2021 22:17 IST

కోల్‌కతా: నందిగ్రామ్‌లో భాజపా నేత సువేందు అధికారి ఎన్నికను సవాల్‌ చేస్తూ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కోల్‌కతా హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. జూన్‌ 24న ఈ అంశంపై విచారణ చేపట్టనున్నట్టు న్యాయమూర్తి జస్టిస్‌ కౌశిక్‌ చందా తెలిపారు. ఈ రోజు విచారణలో భాగంగా మమత తరఫు న్యాయవాది ఈ అంశాన్ని జడ్జి వద్ద ప్రస్తావించగా.. ఎన్నికల పిటిషన్‌ అయినందున తొలి రోజు విచారణకు సీఎం మమతా బెనర్జీ స్వయంగా హాజరు కావాల్సి ఉందని చెప్పారు. దీనిపై  స్పందించిన న్యాయవాది.. చట్టప్రకారమే ఆమె వ్యవహరిస్తారని చెప్పడంతో విచారణను గురువారానికి వాయిదా వేశారు.

బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షించిన నందిగ్రామ్‌ స్థానంలో దీదీపై సువేందు అధికారి స్వల్ప ఓట్ల తేడాతోనే గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే, ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగిందని, రీకౌంటింగ్‌కు డిమాండ్‌ చేసినప్పటికీ సంబంధిత ఈసీ అధికారి పట్టించుకోలేదని ఆరోపిస్తూ వచ్చిన మమతా బెనర్జీ.. ఆయన ఎన్నికను సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు