‘మయన్మార్‌లో రక్తపాతం.. ఎంతో భయానకం’ 

మయన్మార్‌లో ఆందోళనకారులపై సైనిక దళాల హింసను అమెరికా ఖండించింది. సైన్యం సృష్టించిన రక్తపాతాన్ని భయానక చర్యగా అభివర్ణించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ శనివారం ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.డ

Updated : 28 Mar 2021 12:12 IST

వాషింగ్టన్‌: మయన్మార్‌లో ఆందోళనకారులపై సైనిక దళాల హింసను అమెరికా ఖండించింది. సైన్యం సృష్టించిన రక్తపాతాన్ని భయానక చర్యగా అభివర్ణించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ శనివారం ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. మయన్మార్‌లో శనివారం జరిగిన సైనిక హింసలో 114 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చర్యలను ఐరాసతో పాటు పలు దేశాలు ఖండించాయి. 

‘మయన్మార్‌లో ఆందోళనకారులపై భద్రతాదళాలు సృష్టించిన రక్తపాతం భయంకరమైనది. కొంత మంది కోసం సైన్యం ప్రజల ప్రాణాలను పణంగా పెడుతోంది. అక్కడ కొనసాగుతున్న ఈ సైనిక చర్యలను బర్మా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు’ అని బ్లింకెన్‌ తెలిపారు. మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై శనివారం భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 114 మంది పౌరులు మరణించారు. కాగా, ఫిబ్రవరి 1న సైన్యం అధికారాన్ని చేతుల్లోకి తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు 400 మంది పౌరులు మరణించారు. మరోవైపు తిరుగుబాటుకు నేతృత్వం వహించిన జనరల్‌ మిన్‌ అంగ్‌ లయాంగ్‌ శనివారం టీవీలో ప్రసంగిస్తూ,.. త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు