Nitin Gadkari: ‘నేను అందరికంటే పెద్ద పర్యావరణవేత్తను. కానీ..’

గోవాలో ఇటీవల ప్రతిపాదించిన ఆయా మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులపై పర్యావరణవేత్తల నుంచి పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. రైల్వే లైన్ డబ్లింగ్‌, గోవా-హుబ్బల్లీ జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించడం, కొత్త విద్యుత్...

Published : 02 Nov 2021 20:13 IST

పనాజీ: గోవాలో ఇటీవల ప్రతిపాదించిన ఆయా మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులపై పర్యావరణవేత్తల నుంచి పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. రైల్వే లైన్ డబ్లింగ్‌, గోవా-హుబ్బళ్లి జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించడం, కొత్త విద్యుత్ లైన్ల ఏర్పాటు తదితర ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ భారీ నిరసనలూ జరిగాయి. ప్రాజెక్టులకు సంబంధించి రక్షిత అటవీ ప్రాంతంలో పెద్ద మొత్తంలో వృక్షాల నరికివేత, వందల హెక్టార్ల భూ సేకరణ చేపట్టాల్సి ఉండటంతో.. పర్యావరణవేత్తలు అభ్యంతరం తెలుపుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రజలకు ఉపాధి అందించి, పేదరికం నుంచి బయటపడేసే ఆర్థికాభివృద్ధిని సాధించే క్రమంలో.. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై వ్యతిరేకత అంశం అడ్డుగా వస్తోందన్నారు. ‘నేను అందరికంటే పెద్ద పర్యావరణవేత్తను. అయితే పుస్తకాలు మాత్రం రాయను. జలసంరక్షణకు పాటుపడే ఒక ఎన్‌జీవో కూడా ఉంది. అది అవార్డూ గెలుచుకుంది. ఇదే క్రమంలో భారత్‌లో ఇథనాల్, మిథనాల్, బయోడీజిల్, బయో సీఎన్‌జీ తదితర ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రవేశపెట్టాను. మనమంతా పర్యావరణాన్ని పరిరక్షించాల్సిందే. కానీ.. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ముఖ్యమైనదే. ఆర్థికాభివృద్ధితో ప్రజలకు ఉపాధి దొరుకుతుంది. తద్వారా పేదరికం నిర్మూలన సాధ్యపడుతుంది. పర్యావరణం.. అభివృద్ధి.. ఈ రెండింటి మధ్య సమతూకం ఉండాలి' అని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు