అధ్యక్ష ఎన్నికలు మాకు పరీక్ష: జుకెర్‌ బర్గ్‌

భారత్‌లో ఎన్నికల సందర్భంగా ప్రజాస్వామ్య సమగ్రతను కాపాడేందుకు తాము చేపట్టిన చర్యల అనుభవం..అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఉపయోగపడుతోందని ఫేస్‌బుక్‌ సీఈవో

Published : 30 Oct 2020 23:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో ఎన్నికల సందర్భంగా ప్రజాస్వామ్య సమగ్రతను కాపాడేందుకు తాము చేపట్టిన చర్యల అనుభవం.. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఉపయోగపడుతోందని ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకెర్‌ బర్గ్‌ అన్నారు. భారత్‌ సహా అనేక దేశాల ఎన్నికల సమయంలో ఇది మేలు చేసిందని ఆయన వివరించారు. నవంబరు 3న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలు తమకు పరీక్ష వంటివని జుకెర్ బర్గ్‌ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య సమగ్రతను కాపాడేందుకు తాము నిరంతరం పోరాటం సాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. తాము చేసిన అనేక మార్పులు కూడా సమగ్రత రక్షణకు దోహదం చేశాయని వెల్లడించారు. ఓటర్ల అణచివేతను కట్టడి చేయటం సహా వివిధ అంశాలపై పౌరహక్కుల సంఘాలు, నిపుణులు, తదితరులతో కలిసి పనిచేస్తున్నామన్నారు. హ్యాకింగ్‌ లాంటి సంప్రదాయ ముప్పును తప్పించుకునేందుకు గత నాలుగేళ్లుగా నిపుణుల బృందాలతో కలిసి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అయినా నకిలీ ఖాతాల ద్వారా తప్పుడు ప్రచారాలు, అవాస్తవాల వ్యాప్తి జరిగిందని వివరించారు. దీనిని అరికట్టేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని