India-Australia: వచ్చే ఏడాది చివరికి భారత్‌-ఆస్ట్రేలియా వాణిజ్య ఒప్పందం..!

భారత్‌-ఆస్ట్రేలియాలు వచ్చే ఏడాది చివరి నాటికి  వాణిజ్య ఒప్పందం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని ఇరు దేశాలు శుక్రవారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి.

Published : 01 Oct 2021 23:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌-ఆస్ట్రేలియాలు వచ్చే ఏడాది చివరి నాటికి  వాణిజ్య ఒప్పందం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని ఇరు దేశాలు శుక్రవారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. ఇరు దేశాల వాణిజ్యమంత్రులు దిల్లీలో భేటీ అయ్యారు. ఈ చర్చల్లో ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రి డాన్‌ టెహాన్‌, భారత మంత్రి పీయూష్‌ గోయెల్‌ పాల్గొన్నారు.

పదేళ్ల క్రితమే ఈ ఒప్పందం కోసం చర్చలు ప్రారంభమైనా.. 2015లో అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ప్రస్తుతం ఇరు దేశాల వాణిజ్యం సుమారు 17 బిలియన్‌ డాలర్ల వరకూ ఉంది. ఈ ఏడాది చివరి లోపు కొన్ని సుంకాలను తగ్గించేలా తాత్కాలిక ఒప్పందం చేసుకొనే అవకాశం ఉంది. 

భారత్‌ సేవా రంగం నుంచి భారీగా ఆస్ట్రేలియాకు ఎగుమతులు జరుగుతుండగా.. అక్కడి నుంచి బొగ్గును భారత్‌ దిగుమతి చేసుకొంటోంది. ఇరు దేశాలు క్వాడ్‌ బృందంలో సభ్యులు. ఆస్ట్రేలియా ఏడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా భారత్‌ నిలిచింది. సమతౌల్యమైన వాణిజ్య ఒప్పందం జరుగుతుందనే  ఆశాభావం ఇరుపక్షాల్లో ఉంది. ‘సమతౌల్యమైన వాణిజ్య ఒప్పందం ఇరు పక్షాల వాణిజ్యాన్ని పెట్టుబడుల విస్తరణకు ఉపయోగపడుతుంది. ఇది ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు లాభదాయకం’’ అని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు