India Corona : కొత్తగా 2,226 కేసులు.. 2,202 రికవరీలు..

దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు

Published : 22 May 2022 10:26 IST

దిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు 2500లోపే నమోదవుతుండటం ఊరట కలిగిస్తోంది. మరోవైపు క్రియాశీల కేసులు కూడా 15 వేల దిగువనే కొనసాగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

* నిన్న 4,42,681 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,226 కేసులు వెలుగులోకి వచ్చాయి.

* గడిచిన 24 గంటల్లో కరోనాతో 65 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 5,24,413కు చేరింది.

* నిన్న 2202 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.25 కోట్లు (98.75%) దాటింది.

* ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 14,955(0.03%)గా ఉన్నాయి.

నిన్న 14,37,381 మంది టీకాలు తీసుకోగా.. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 192.28 కోట్లు దాటింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు