Corona Vaccination: 192 కోట్ల టీకాల పంపిణీ.. మరో అరుదైన రికార్డుకు చేరువలో

కరోనా వ్యాప్తిని అదుపులోకి తెచ్చి.. కోట్లాది మంది ప్రాణాలను కాపాడుతోన్న బృహత్తర టీకా పంపిణీ కార్యక్రమంలో భారత్‌ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉంది.

Published : 20 May 2022 10:13 IST

దిల్లీ: కరోనా వ్యాప్తిని అదుపులోకి తెచ్చి.. కోట్లాది మంది ప్రాణాలను కాపాడుతోన్న బృహత్తర టీకా పంపిణీ కార్యక్రమంలో భారత్‌ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉంది. 2021 జనవరి 16న వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించగా.. ఇప్పటి వరకు 191.96కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి. త్వరలోనే 200 కోట్ల డోసుల మైలురాయిని చేరుకోనుంది.

కట్టడిలోనే కరోనా వ్యాప్తి..

కరోనా మహమ్మారి కట్టడిలోనే ఉంది. స్వల్ప హెచ్చు తగ్గుదలతో కొత్త కేసులు 3వేల దిగువనే ఉంటున్నాయి. గురువారం దేశవ్యాప్తంగా 4.51లక్షల మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,259 మందికి పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజు(2,364)తో పోలిస్తే కేసులు కాస్త తగ్గాయి. రోజువారీ పాజిటివిటీ రేటు ఒక శాతానికి(0.53శాతం) దిగువనే ఉంది.

ఇక కొత్త కేసుల కంటే రికవరీలు అధికంగా ఉండటం ఊరటనిచ్చే అంశం. తాజాగా 24 గంటల వ్యవధిలోనే 2,614 మంది కోలుకోగా.. రికవరీ రేటు 98.75శాతంగా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15,044 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల కేసుల రేటు 0.03శాతంగా ఉంది. నిన్న మరో 20 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 5.24లక్షల మందిని మహమ్మారి బలి తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని