ఎల్‌ఈడీలతో 3.8 కోట్ల టన్నుల CO2 తగ్గించాం!

నిర్దేశిత సమయంలోగా పారిస్‌ ఒప్పంద లక్ష్యాన్ని భారత్‌ చేరుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. సమర్థమైన ఇంధన మాధ్యమాలను వినియోగించడంతోపాటు వ్యర్థ పదార్థాలతో విద్యుత్‌ ఉత్పత్తి చేసే మార్గాలవైపు.........

Published : 05 Mar 2021 22:26 IST

గడువులోపే పారిస్‌ ఒప్పంద లక్ష్యం: మోదీ

దిల్లీ: నిర్దేశిత సమయంలోగా పారిస్‌ ఒప్పంద లక్ష్యాన్ని భారత్‌ చేరుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. సమర్థమైన ఇంధన మాధ్యమాలను వినియోగించడంతోపాటు వ్యర్థ పదార్థాలతో విద్యుత్‌ ఉత్పత్తి చేసే మార్గాలవైపు అడుగులు వేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా దేశంలో ఎల్‌ఈడీ బల్బులను అమర్చడం ద్వారా దాదాపు 3.8 కోట్ల టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ను తగ్గించినట్లు పేర్కొన్నారు. కేంబ్రిడ్జి ఎనర్జీ రీసెర్చ్‌ అసోసియేట్స్‌ వీక్ ‌(CERAWeek) ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగించారు.

పర్యావరణ లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా భారత్‌ అన్ని చర్యలూ తీసుకుంటుందని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. వ్యర్థాలను సంపదగా మార్చే ప్రక్రియలో భాగంగా 2024 నాటికి దేశవ్యాప్తంగా 5వేల కంప్రెస్స్‌డ్ బయో గ్యాస్‌ ప్లాంట్లను నెలకొల్పనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆరోగ్యంపైన మాట్లాడిన మోదీ.. ‘నేడు యావత్ ప్రపంచం ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెడుతోంది. దీంతో ఆరోగ్యకరమైన సేంద్రియ ఆహారానికి డిమాండ్‌ పెరిగింది. ఇలాంటి సమయంలో మన దేశంలో ఉన్న సుగంధ ద్రవ్యాలు, ఆయుర్వేద ఉత్పత్తులతో ప్రపంచవ్యాప్తంగా మార్పును తీసుకురావడంతో ముందుంటాయి’ అని మోదీ అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని