1962లో బలమైన నాయకత్వం ఉండి ఉంటే.. అరుణాచల్‌ గవర్నర్‌ కీలక వ్యాఖ్యలు

సరిహద్దుల్లో సైనికులు ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉండాలని సూచించిన అరుణాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బ్రిగేడియర్‌ బీడీ మిశ్రా(రిటైర్డ్‌) కీలక వ్యాఖ్యలు చేశారు....

Published : 21 Nov 2021 11:15 IST

ఇటానగర్‌: సరిహద్దుల్లో సైనికులు ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉండాలని సూచించిన అరుణాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బ్రిగేడియర్‌ బీడీ మిశ్రా(రిటైర్డ్‌) కీలక వ్యాఖ్యలు చేశారు. 1962లో భారత్‌లో బలమైన నాయకత్వం ఉండి ఉంటే..  చైనాతో జరిగిన యుద్ధంలో భారత్‌ దెబ్బతిని ఉండేది కాదని వ్యాఖ్యానించారు. 1962లో భారత్‌-చైనా మధ్య యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. చంగ్‌లాంగ్‌ జిల్లాలోని 14వ బెటాలియన్‌ ఆపరేషనల్‌ బేస్‌లో జరిగిన సైనిక సమ్మేళన్‌లో ఆయన శనివారం సాయంత్రం ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘‘1962లో భారత్‌కు బలమైన నాయకత్వం ఉండి ఉంటే.. చైనాతో మనకు ఎదురుదెబ్బ తగిలి ఉండేది కాదు. కానీ, ఇప్పుడు క్షేత్రస్థాయిలో సమీకరణాలు మారిపోయాయి. ప్రపంచంలో అత్యంత బలమైన సైనిక శక్తి కలిగిన దేశాల్లో భారత్‌ ఒకటి. మనం మన స్థైర్యాన్ని కోల్పోవద్దు. సరిహద్దుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనల్ని ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండాలి. సైనికులు పట్టుదలతో ఉంటే.. వారికి అన్నింట్లో విజయం వరిస్తుంది. ప్రభుత్వ ఆలోచనాతీరులో సైతం చాలా మార్పొచ్చింది. సైనికుల సంక్షేమం కోసం దిల్లీలోని ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది’’ అని బ్రిగేడియర్‌ మిశ్రా అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని