US: భారత సంతతి సీఈఓ దారుణ హత్య.. 80 కి.మీ. వెంబడించి మరీ..!

అమెరికాలో భారత సంతతికి చెందిన ఫార్మా సంస్థ సీఈఓ దారుణ హత్యకు గురయ్యారు. ఓ దుండగుడు డబ్బుకోసం దాదాపు 80 కిలోమీటర్లు వెంబడించి మరీ......

Published : 30 Oct 2021 21:40 IST

న్యూయార్క్‌: అమెరికాలో భారత సంతతికి చెందిన ఫార్మా సంస్థ సీఈఓ దారుణ హత్యకు గురయ్యారు. ఓ దుండగుడు డబ్బుకోసం దాదాపు 80 కిలోమీటర్లు వెంబడించి మరీ.. వ్యాపారవేత్తను కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. న్యూజెర్సీలో జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

న్యూజెర్సీలోని ప్లెయిన్స్​బోరో ప్రాంతానికి చెందిన శ్రీరంగ అరవపల్లి(54) ఔరెక్స్‌ లేబొరేటరీస్‌ పేరుతో 2014 నుంచి ఫార్మా సంస్థను నడుపుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఓ క్లబ్​లో క్యాసినో ఆట ముగించుకుని శ్రీరంగ దాదాపు 10 వేల డాలర్లతో ఇంటికి బయల్దేరారు. అయితే ఆ డబ్బును దొంగిలించాలని పన్నాగం పన్నిన ఓ దుండగుడు శ్రీరంగను పెన్సిల్వేనియాలోని ఆ క్యాసినో నుంచి వెంబడించాడు. దాదాపు 80 కిలోమీటర్ల దూరం సీఈఓను ఫాలో అయినట్లు పోలీసులు తెలిపారు. న్యూజెర్సీలోని ఇంట్లోకి ప్రవేశిస్తున్న సమయంలో దుండగుడు ఆయనపై కాల్పులు జరపడంతో మృతిచెందినట్లు వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు జెకాయ్ రీడ్ జాన్(27)​ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించారు. అతడిని అరెస్టు చేసి విచారణ జపుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని