Published : 21/08/2021 12:39 IST

Afghan Crisis: కాబుల్‌ నుంచి భారతీయుల తరలింపు

దిల్లీ: కల్లోలిత అఫ్గానిస్థాన్‌ నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. కాబుల్‌ విమానాశ్రయం నుంచి శనివారం కొంతమంది భారతీయులను వాయుసేన ప్రత్యేక విమానంలో స్వదేశానికి తీసుకొస్తున్నారు. ఈ ఉదయం 85 మందికి పైగా భారత పౌరులతో సి-130జె విమానం కాబుల్‌ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ విమానం ఇంధనం నింపుకొనేందుకు తజకిస్థాన్‌లో దిగినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఇక వాయుసేనకు చెందిన మరో సి-17 విమానం కూడా కాబుల్‌ ఎయిర్‌పోర్టులో ఉంది. భారతీయులను తీసుకుని ఆ విమానం కూడా త్వరలోనే స్వదేశానికి బయల్దేరనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అఫ్గాన్‌లోని భారత రాయబార కార్యాలయ సిబ్బందిని ప్రత్యేక విమానంలో స్వదేశానికి తరలించిన విషయం తెలిసిందే.

తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించిన తర్వాత ఆ దేశ గగనతలాన్ని మూసివేశారు. దీంతో భారతీయుల తరలింపు ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. అయితే ఆ తర్వాత అమెరికా దళాల సహకారంతో భారత్‌ ప్రత్యేక విమానాల్లో భారతీయుల తరలింపునకు ఏర్పాట్లు చేసింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని