Published : 19/08/2021 23:00 IST

Defence news: ‘దేశ భద్రత సవాళ్లు సంక్లిష్టంగా మారుతున్నాయి’

దిల్లీ: అఫ్గాన్‌ తాలిబన్ల వశమైన ప్రస్తుత తరుణంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా దేశ భద్రత సవాళ్లు పెరుగుతున్నాయని, అవి సంక్లిష్టంగానూ మారుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సైన్యం అవసరాలు తీర్చేందుకుగానూ రక్షణశాఖ మాన్యుఫ్యాక్చరింగ్‌ సెక్టార్‌ అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. ఇన్నోవేషన్స్‌ ఫర్‌ డిఫెన్స్‌ ఎక్స్‌లెన్స్‌(ఐడీఈఎక్స్‌) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘డిఫెన్స్‌ ఇండియా స్టార్టప్‌ ఛాలెంజ్‌ 5.0’ను గురువారం ఆయన ప్రారంభించి, మాట్లాడారు. ప్రతిభావంతులకు.. వారి డిమాండ్‌కు మధ్య ఐడీఈఎక్స్‌ మంచి వేదికగా నిలుస్తోందన్నారు. రక్షణ శాఖలో తయారీ పరిశ్రమ బలోపేతానికి ప్రైవేట్ రంగం సహకరించాలని పిలుపునిచ్చారు. భారత్‌ను ఈ సెక్టార్‌కు హబ్‌గా మార్చేందుకు కేంద్రం రెండేళ్లుగా అనేక కార్యక్రమాలు చేపడుతోన్న విషయం తెలిసిందే.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని