Updated : 21/06/2021 12:42 IST

kim: కిమ్‌ వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి..!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తరకొరియా నియంత కిమ్‌ తొలిసారి అధ్యక్షుడు బైడెన్‌ సర్కారుపై చేసిన వ్యాఖ్యలకు అమెరికా స్పందించింది. గత వారం కిమ్‌ అమెరికా కొత్త ప్రభుత్వాన్ని ఉటంకిస్తూ ‘‘చర్చలకైనా.. యుద్ధానికైనా సిద్ధంగా ఉండాలి’’ అని తన సేనలకు సూచించారు. ఆదివారం ఈ వ్యాఖ్యలపై అమెరికా స్పందిస్తూ.. దీనిని మేము ఆసక్తికరమైన సంకేతంగా భావిస్తున్నాం అని పేర్కొంది. కానీ, అణ్వాయుధాలను త్యజించే అంశాలపై చర్చలకు ప్యాంగ్యాంగ్‌ నుంచి నేరుగా కచ్చితమైన సంకేతాలు రానంత కాలం తాము వేచిచూస్తామని పేర్కొంది.

‘‘ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. కానీ, బలమైన వేదిక కోసం మరింత స్పష్టమైన సంకేతాలు వచ్చే వరకు వేచిచూస్తాం. అమెరికా చర్చలకు సిద్ధంగా ఉందని బైడెన్‌ కార్యవర్గం ఎప్పుడో తెలియజేసింది. ఉత్తర కొరియా అణుకార్యక్రమంతో సవాళ్లను ఎదుర్కొని.. కొరియన్‌ ద్వీపకల్పాన్ని పూర్తిగా అణ్వాయుధ రహితంగా చేసేందుకు సిద్ధంగా ఉంది’’ అని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్‌ సలైవాన్‌ పేర్కొన్నారు.

గత వారం ఉత్తరకొరియా నియంత కిమ్‌జోంగ్‌ ఉన్‌ తొలిసారి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌పై గురిపెడుతూ ప్రకటన చేశారు. ఉత్తర కొరియా చర్చలకైనా, ఘర్షణకైనా సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. అమెరికాలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం దౌత్య సంబంధాలను పెట్టుకోవడానికి ప్రయత్నిస్తే కిమ్‌ సర్కారు ఆసక్తి చూపలేదు. తాజాగా తొలిసారి అమెరికాపై కిమ్‌ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రారంభమైన ఉత్తర కొరియా సీనియర్‌ నాయకుల సమావేశంలో కిమ్‌ మాట్లాడారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని