Published : 24/08/2021 18:01 IST

Corona Virus: ‘డెల్టా’ పంజా.. ఇరాన్‌లో రికార్డు స్థాయిలో మరణాలు!

టెహ్రాన్‌: ఇరాన్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న డెల్టా వేరియంట్‌ ఇరాన్‌లో మృత్యునాదం చేస్తోంది. గడిచిన 24గంటల వ్యవధిలోనే 709మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఇరాన్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. వైరస్‌ బారినపడిన వారిలో మరో 7,727మంది రోగుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు పేర్కొంది. నిన్న ఒక్కరోజే 40,600 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు తెలిపింది.  ఇరాన్‌లో వైరస్‌ వ్యాప్తి ఇంతలా పెరగడానికి కారణం డెల్టా వేరియంటేనని అధికారులు పేర్కొంటున్నారు. కొవిడ్‌ కట్టడికి విధించిన ఐదు రోజుల కఠిన లాక్‌డౌన్‌ ఇటీవలే ముగిసింది. ఇప్పటివరకు కేవలం ఎనిమిది శాతం మంది ఇరాన్‌ ప్రజలు మాత్రమే పూర్తిగా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. అలాగే, తమ దేశంలో 40శాతం కన్నా తక్కువ మంది ప్రజలు మాత్రమే మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి కొవిడ్‌ నిబంధనలను పాటిస్తున్నారని అధికారులు చెబుతున్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని