Sea Breaker: సీ బ్రేకర్‌ను ఆవిష్కరించిన ఇజ్రాయెల్‌..!

ఇజ్రాయెల్‌కు చెందిన రక్షణ పరికరాల తయారీ సంస్థ రఫేల్‌ అడ్వాన్స్‌డు డిఫెన్స్‌ సిస్టమ్‌ సరికొత్త క్షిపణినికి ఆవిష్కరించింది.

Published : 30 Jun 2021 16:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇజ్రాయెల్‌కు చెందిన రక్షణ పరికరాల తయారీ సంస్థ రఫేల్‌ అడ్వాన్స్‌డ్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ సరికొత్త క్షిపణినిని ఆవిష్కరించింది. ఈ 5వ తరం క్షిపణి పేరు సీ బ్రేకర్‌గా పేర్కొంది. ఇది స్వీయనియంత్రణలో సుదూర లక్ష్యాలను గురితప్పకుండా ఛేదిస్తుందని కంపెనీ పేర్కొంది. ముఖ్యంగా ఈ క్షిపణి శతఘ్ని దళం, నావికా దళానికి అదనపు బలాన్నిస్తుందని కంపెనీ పేర్కొంది. భూమిపై నుంచి నౌకలపై నుంచి దీనిని ప్రయోగించవచ్చు. 

మేకిన్‌ ఇండియా కింద ఈ ఆయుధాన్ని భారత్‌కు కూడా ఆఫర్‌ చేయవచ్చని ఆంగ్లవెబ్‌సైట్‌ ది ప్రింట్‌ పేర్కొంది. ఇప్పిటికే రఫేల్‌కు భారత్‌లో కల్యాణి గ్రూప్‌తో జాయింట్‌ వెంచర్‌ ఉంది. దీనిని కల్యాణి రఫేల్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌గా వ్యవహరిస్తారు. ఈ సంస్థ మార్చి నుంచి కిట్స్‌ అనే సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిసైల్‌ను తయారు చేస్తోంది. ఇదే సంస్థతో భారత్‌లో దీనిని ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.భారత్‌ వద్ద ఇప్పటికే బ్రహ్మోస్‌ ఉంది. దానికి సీ బ్రేకర్‌కు పోలికలు ఉంటాయి.

ఈ క్షిపణి నాలుగు మీటర్ల కంటే తక్కువ పొడవు, 400 కేజీల కంటే తక్కువ బరువు ఉంటుంది. దీనిపై 113 కిలోల వార్‌హెడ్‌ను అమర్చవచ్చు. ఇది దాదాపు 226 కిలోల ఎంకే 82 బాంబు అంత విస్ఫోటాన్ని  సృష్టిస్తుంది. ఇది ఒక ఫ్రిగేట్‌ సైజు నౌకను ముంచేయగలదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని