Updated : 10/03/2021 04:35 IST

నాసాతో కలిసి ‘నిసార్‌’ను అభివృద్ధి చేసిన ఇస్రో

దిల్లీ: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా)తో కలిసి అత్యంత హై రెజల్యూషన్‌ చిత్రాలు తీసే సింథటిక్‌ అపెర్చర్‌ రాడార్‌ (ఎస్‌ఏఆర్‌)ను ఇస్రో అభివృద్ధి చేసింది. సంయుక్త భూ పరిశోధన మిషన్‌ కోసం ఈ రాడార్‌ను ఇరుదేశాల అంతరిక్ష పరిశోధన సంస్థలు అభివృద్ధి చేశాయి. నాసా-ఇస్రో పేరు కలిసి వచ్చేలా ఈ వ్యవస్థకు నిసార్‌ అని పేరు పెట్టారు. ఎల్‌ఎస్‌ బ్యాండ్‌ ఫ్రీక్వెన్సీ ఉపగ్రహాల్లో ఉపయోగించేలా రూపొందించిన నిసార్‌ భూ పరిశోధనకు ఉపకరిస్తుంది. భూమిపై సెంటీమీటర్‌ కంటే తక్కువ వైశాల్యాన్ని కూడా నిసార్‌ ద్వారా కొలువవచ్చని నాసా పేర్కొంది.

నిసార్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు ఇస్రో 2014 సెప్టెంబర్‌లో నాసాతో ఒప్పందం చేసుకుంది. 2022లో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ప్రయోగించే ఉపగ్రహంలో నిసార్‌ను ఉపయోగించాలని లక్ష్యంగా నిర్దేశించారు. సంయుక్త మిషన్‌ కోసం ఎల్‌ బ్యాండ్‌ సింథటిక్‌ అపెర్చర్‌ రాడార్‌తోపాటు సైన్స్‌ డేటా కోసం హైరేట్‌ కమ్యూనికేషన్‌ సబ్‌ సిస్టమ్‌, జీపీఎస్‌ రిసీవర్లు, సాలిడ్‌ స్టేట్‌ రికార్డర్‌, పెలో డేటా సబ్‌సిస్టమ్‌లను నాసా సమకూరుస్తోంది. వాహక నౌక ఎస్‌ బ్యాండ్‌ రాడార్‌ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు అవసరమైన సేవలను ఇస్రో సమకూరుస్తోంది. ఈ సంయుక్త మిషన్‌తో ఆధునిక రాడార్‌ ఇమేజింగ్‌ ద్వారా భూ ఉపరితల మార్పులకు కారణాలను కనుగొనవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని