Boko Haram: బోకోహరం ఉగ్రసంస్థ అధినేత హతం!

పశ్చిమాఫ్రికాలోని నైజీరియాలో నెత్తుటేరులు పారించి.. వేల మందిని పొట్టన పెట్టుకొని, ఎంతో మందిని అపహరించిన ఉగ్రసంస్థ బోకోహరం ఉగ్రసంస్థ అధినేత అబూబకర్‌ షెకావ్‌ హతమైనట్లు తెలుస్తోంది....

Published : 07 Jun 2021 20:47 IST

అబూజ: పశ్చిమాఫ్రికాలోని నైజీరియాలో వేల మందిని పొట్టన పెట్టుకొని, ఎంతో మందిని అపహరించిన ఉగ్రసంస్థ బోకోహరం ఉగ్రసంస్థ అధినేత అబూబకర్‌ షెకావ్‌ హతమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రత్యర్థి ఇస్లాం మిలిటెంట్‌ గ్రూప్‌ ఓ ఆడియో విడుదల చేసింది. అయితే నైజీరియా ప్రభుత్వం కానీ, బోకోహరం ఉగ్రవాద సంస్థ కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో అబూ బకర్‌ తనను తాను పేల్చుకొని మృతిచెందాడని ఇస్లామిక్‌ స్టేట్‌ వెస్ట్‌ ఆఫ్రికా ప్రావిన్స్‌ (ఐఎస్‌డబ్ల్యూఏపీ) ఓ ఆడియో విడుదల చేసింది.

రెండు వారాల క్రితమే షెకావు మరణించినట్లు రాయిలర్స్‌ వార్తా సంస్థ వెల్లడించింది. తమ అధినేత మరణంపై బోకోహరం ఇప్పటివరకు స్పందించలేదు. వాస్తవాలు తెలుసుకునేందుకు సైన్యం ప్రయత్నిస్తోందని.. ఆధారాలు లభించేంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేమని నైజీరియా సైన్యం ప్రకటించింది. గతంలో అబూబకర్‌ షెకావ్‌ మృతిచెందినట్లు అనేకసార్లు వార్తలు వెలువడినా అవి నిజం కాదని తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు