Jeff Bezos: టైటానిక్‌ హీరోకు జెఫ్‌ బెజోస్‌ బెదిరింపులు.. ఎందుకో తెలుసా?

అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్.. హాలీవుడ్‌ అగ్ర హీరో, టైటానిక్‌ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న నటుడు లియోనార్డో డికాప్రియోపై బెదిరింపులకు పాల్పడ్డాడు.....

Published : 10 Nov 2021 01:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అపర కుబేరుడు, అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్.. హాలీవుడ్‌ అగ్ర హీరో, టైటానిక్‌ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న నటుడు లియోనార్డో డికాప్రియోపై బెదిరింపులకు పాల్పడ్డారు ఇక్కడకు రా.. చూసుకుందాం అంటూ భయపెట్టాడు. అయితే ఇదంతా సరదాకే. తన ప్రియురాలు, డికాప్రియోకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో జెఫ్‌ బెజోస్‌ ట్విటర్‌ వేదికగా సరదాగా స్పందించారు.

ఇంతకీ విషయం ఏంటంటే.. అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో గత శనివారం జరిగిన లాక్మే ఆర్ట్‌+ఫిల్మ్‌ గాలా కార్యక్రమానికి అమెజాన్‌ అధినేత తన ప్రియురాలు లారెన్‌ సాంచెజ్‌తో కలిసి హాజరయ్యారు. అదే వేడుకకు డికాప్రియో సైతం వచ్చారు. ఈ సందర్భంగా డికాప్రియో, లారెన్‌ సాంచెజ్‌ కొద్దిసేపు సరదాగా సంభాషించుకున్నారు. ఇందుకు సంబంధించి ఆరు సెకన్ల నిడివి గల ఓ వీడియో ట్విటర్‌లో తెగ వైరలవుతోంది. కాగా ఈ వీడియోపై జెఫ్ బెజోస్‌ సరదాగా స్పందించారు. ‘ప్రమాదం! ఏటవాలుగా ఉన్న కొండ ప్రాంతం’ అని హెచ్చరిక బోర్డును పట్టుకొని చొక్కా లేకుండా తాను దిగిన ఓ ఫొటోను ఆ వీడియోకు జత చేస్తూ.. ‘లియో ఇక్కడకు రా.. నీకొకటి చూపించాలి’ అంటూ బెజోస్‌ ఓ ట్వీట్‌ చేశారు. కాగా ఈ ట్వీట్‌ వైరలయ్యింది. ఇప్పటికే దానిని 17 మిలియన్ల మంది వీక్షించారు. 1.4 లక్షల లైకులతోపాటు వేల మంది సరదా కామెంట్లు చేశారు.

57 ఏళ్ల జెఫ్‌ బెజోస్‌కు 25 ఏళ్ల క్రితమే మెకెంజీ స్కాట్‌ అనే మహిళతో వివాహం జరిగింది. అయితే అమెరికన్‌ యాంకర్‌ అయిన లారెన్‌ సాంచెజ్‌తో బెజోస్‌కు 2019లో పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారింది. దీంతో తమ దాంపత్య జీవితానికి స్వస్తి పలుకుతూ అదే ఏడాది భార్య మెకెంజీ స్కాట్‌తో విడాకులు తీసుకున్నాడు. భరణంగా 38 బిలియన్‌ డాలర్లు (రూ.2.62 లక్షల కోట్లు) ఇచ్చినట్లు పలు వార్తలు వచ్చాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని