America: ప్రపంచ దేశాలకు భారీ సాయం

ప్రపంచ దేశాలకు 8 కోట్ల టీకాలను అందిచనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వెల్లడించారు. ఫైజర్‌, మోడెర్నా, జాన్సన్ అండ్‌ జాన్సన్ టీకాలను వచ్చే ఆరు వారాల్లో....

Updated : 21 Dec 2022 14:48 IST

వాషింగ్లన్‌: ప్రపంచ దేశాలకు 8 కోట్ల టీకాలను అందిచనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వెల్లడించారు. ఫైజర్‌, మోడెర్నా, జాన్సన్ అండ్‌ జాన్సన్ టీకాలను వచ్చే ఆరు వారాల్లో ప్రపంచ దేశాలకు అందించనున్నట్లు స్పష్టం చేశారు. అమెరికాలో ఉత్పత్తి అయ్యే టీకాల్లో ఈ మొత్తం 13 శాతం కాగా ఇప్పటివరకు రష్యా, చైనా.. ప్రపంచ దేశాలకు సరఫరా చేసినదానికంటే 5 రెట్లు ఎక్కువని బైడెన్‌ వెల్లడించారు. ప్రపంచమంతా మహమ్మారితో బాధపడుతుంటే అమెరికా సురక్షితంగా ఉండలేదని బైడెన్‌ పేర్కొన్నారు. అమెరికాలో ప్రస్తుతం ఫైజర్‌, మోడెర్నా,, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్లు వినియోగిస్తున్నారు.

కరోనా మహమ్మారిపై చేస్తున్న పోరాటంలో భారత్‌కు ఎల్లవేళలా అండగా ఉంటామని అగ్రరాజ్యం మరోసారి హామీ ఇచ్చింది. భారత్‌కు అన్ని విధాలా సహాయసహకారాలు కొనసాగిస్తామని శ్వేతసౌధం ప్రకటించింది. కరోనాపై పోరులో భాగంగా భారత్‌కు అమెరికా ఇప్పటికే 100 మిలియన్‌ డాలర్ల సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన కార్యక్రమాలను అధ్యక్షుడు జో బైడెన్‌ దగ్గరుండి చూసుకుంటున్నారని వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి జెన్‌ సాకీ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని