Joe Biden: ‘ప్రజాస్వామ్యం’పై సదస్సు.. 110 దేశాలకు బైడెన్‌ ఆహ్వానం!

అగ్రరాజ్యం అమెరికా వచ్చే నెలలో ‘ప్రజాస్వామ్యం’అనే అంశంపై విర్చువల్‌గా శిఖరాగ్ర సదస్సు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సదస్సులో పాల్గొనాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రపంచంలోని 110 దేశాలకు ఆహ్వానం పంపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య

Published : 24 Nov 2021 21:21 IST

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా వచ్చే నెలలో ‘ప్రజాస్వామ్యం’అనే అంశంపై వర్చువల్‌గా శిఖరాగ్ర సదస్సు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సదస్సులో పాల్గొనాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రపంచంలోని 110 దేశాలకు ఆహ్వానం పంపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య వెనుకబాటుతనం, మానవ హక్కుల క్షీణతను ఆపడమే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహించబోతున్నారు. డిసెంబర్‌ 9-10 తేదీల్లో జరగనున్న ఈ సదస్సులో పాల్గొనాలంటూ భారత్‌కు కూడా ఆహ్వానం అందింది. ప్రస్తుతం అమెరికాకు వైరిదేశంగా ఉన్న చైనాను పక్కనపెట్టి.. తైవాన్‌కు బైడెన్‌ ఆహ్వానం పంపడం ఆసక్తికరంగా మారింది.

బైడెన్‌ ఆహ్వానించిన దేశాల జాబితాలో ఆసియా ఖండం నుంచి భారత్‌తోపాటు పాకిస్థాన్‌, జపాన్‌, దక్షిణ కొరియా ఉన్నాయి. రష్యా, అఫ్గానిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, వియాత్నం, థాయ్‌లాండ్‌ను సదస్సులో భాగం చేయకపోవడం గమనార్హం. మధ్యప్రాచ్య దేశాల్లో అమెరికా సంప్రదాయ అరబ్‌ కూటమిలో భాగమైన ఈజిప్ట్‌, సౌదీ అరేబియా, జోర్డాన్‌, ఖతర్‌, యూఏఈని వదిలేసి కేవలం ఇజ్రాయెల్‌, ఇరాక్‌ దేశాలకు మాత్రమే ఈ సదస్సుకు ఆహ్వానించింది అమెరికా. యూరప్‌లో పోలాండ్‌కి, ఆఫ్రికాలో డెమోక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, దక్షిణాఫ్రికా, నైజిరియా, నైగర్‌ తదితర దేశాలను ఆహ్వానితుల జాబితాలో చేర్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని