
Updated : 12 May 2021 17:09 IST
కమలా హారిస్ పరుగులు.. వీడియో వైరల్
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ జాగింగ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. వాషింగ్టన్‌లోని లింకన్ స్మారక భవనం మెట్లపై కమల పలుమార్లు కిందకు, పైకి పరుగులు తీశారు. కాగా ఈ పరుగుకు సంబంధించిన దృశ్యాలను ఓ అభిమాని సామాజిక మాధ్యమాల్లో పోస్టుచేయగా అవి వైరల్‌గా మారాయి. వీడియోను చూసిన నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటివి చేయడం వల్లే ఉపాధ్యక్షురాలు ఫిట్‌గా ఉన్నారంటూ పోస్టు చేశారు. భద్రతా సిబ్బందికి పని కల్పిస్తున్నారని మరికొంతమంది సరదా కామెంట్లు పెట్టారు.
ఇవీ చదవండి...
అంతవరకు హెచ్1బి వీసాలివ్వొద్దు
మిస్ ఇండియా వరల్డ్‌గా తెలంగాణ యువతి మానస
Tags :