Omicron: ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌.. కర్ణాటకలో కొత్త మార్గదర్శకాలు!

కర్ణాటకలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వెలుగుచూసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒమిక్రాన్‌ వ్యాప్తిపై రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఒమిక్రాన్‌ను కట్టడి చేసేందుకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేశారు.  రాష్ట్ర రెవెన్యూశాఖ

Published : 03 Dec 2021 23:58 IST

బెంగళూరు: కర్ణాటకలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒమిక్రాన్‌ వ్యాప్తిపై రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఒమిక్రాన్‌ను కట్టడి, ముందస్తు చర్యల కోసం కొత్త మార్గదర్శకాలు విడుదల చేశారు. రాష్ట్ర రెవెన్యూశాఖ కార్యదర్శి ఆర్‌. అశోక్‌ మార్గదర్శకాల గురించి వివరించారు. 

1. వ్యాక్సినేషన్‌(రెండు డోసులు)పూర్తి చేసుకోని వారికి షాపింగ్‌ మాల్స్‌, సినిమా హాళ్లలో ప్రవేశం లేదు.

2. తల్లిదండ్రులు కొవిడ్‌ రెండు డోసులు తీసుకునే వరకు వారి పిల్లల్ని పాఠశాలలోకి అనుమతించరు.

3. పాఠశాలలు, కాలేజీల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను వచ్చే ఏడాది జనవరి 15 వరకు వాయిదా వేసుకోవాలని విద్యా సంస్థలకు ప్రభుత్వం సూచన.

4. విమానాశ్రయాల్లో రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులకు కరోనా టెస్ట్‌ చేస్తారు. రిపోర్టు వచ్చే వరకు ప్రయాణికులు విమానాశ్రయం దాటి వెళ్లకూడదు. 

5. రాష్ట్రవ్యాప్తంగా కరోనా బెడ్లను తిరిగి అందుబాటులో తీసుకురావాలి. ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటు.. గతంలోనే ప్లాంటు ఏర్పాటు చేసి ఉంటే.. మరమ్మతులు చేసి సిద్ధంగా ఉంచాలి. 

6. ఆస్పత్రిలో చేరే బాధితులకు ఆక్సిజన్‌, మందులు, వ్యాక్సిన్‌ కొరత లేకుండా వాటిని ముందస్తుగా కొనుగోలు చేయాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని