Published : 04/06/2021 21:54 IST

Kerala: ₹20వేల కోట్లతో కొవిడ్‌ ప్యాకేజీ

తిరువనంతపురం: కేరళలో రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం కొవిడ్‌ను ఎదుర్కోవడానికి మరో ప్యాకేజీని ప్రకటించింది. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా ₹20 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. దీనికి అదనంగా 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్‌ కోసం ₹1000 కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తున్నట్లు కేరళ ఆర్థిక మంత్రి కేఎన్‌ బాలగోపాల్‌ శుక్రవారం ప్రకటించారు. గత ఆర్థిక మంత్రి థామస్‌ ఐజాక్‌ ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌కు సవరించిన అంచనాలతో తాజా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

20వేల కోట్ల రూపాయల్లో రాష్ట్రంలో నెలకొన్న హెల్త్‌ ఎమర్జెన్సీని ఎదుర్కోవడానికి ₹2,800 కోట్లు కేటాయించినట్లు బాలగోపాల్‌ తెలిపారు. కొవిడ్‌ సంక్షోభ సమయంలో జీవనోపాధి కోల్పోయిన వారికి ₹8,900 కోట్లు, ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవించేలా వడ్డీ రాయితీ, రుణాలు అందించేందుకు రూ.8,300 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా సమయంలో ప్రజలంతా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కొత్తగా ఎలాంటి పన్నుల భారం మోపడం లేదని పేర్కొన్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్