ఆ 279 మంది విద్యార్థినులు.. క్షేమమే!

నైజీరియాలో ఇటీవల అపహరణకు గురైన 279 మంది విద్యార్థినులు దుండగుల చెర నుంచి విడుదలయ్యారు. బయటపడిన బాలికలంతా అధికారులతో క్షేమంగా ఉన్నట్లు జాంఫరా రాష్ట్ర గవర్నర్‌ బెల్లో మతవాలె వెల్లడించారు.

Published : 02 Mar 2021 21:05 IST

లాగోస్‌: నైజీరియాలో ఇటీవల అపహరణకు గురైన 279 మంది విద్యార్థినులు దుండగుల చెర నుంచి విడుదలయ్యారు. బయటపడిన బాలికలంతా క్షేమంగా ఉన్నట్లు జాంఫరా రాష్ట్ర గవర్నర్‌ బెల్లో మతవాలె వెల్లడించారు. విద్యార్థినుల విడుదలకు ప్రభుత్వం దుండగులకు ఎలాంటి మూల్యం చెల్లించుకోలేదని గవర్నర్‌ వివరించారు. 

‘కిడ్నాప్‌కు గురైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు విడుదలయ్యారు. వారు ప్రస్తుతం అధికారుల వద్ద క్షేమంగానే ఉన్నారు. వారిని విడుదలకు శాంతియుత మార్గంలో మేం చేసిన ప్రయత్నం ఫలించింది. దుండగులకు ఎలాంటి మూల్యం చెల్లించలేదు. మేం వారికి ఏం తిరిగి ఇవ్వకుండానే అపహరణకు గురైన వారిని వెనక్కి తీసుకురాగలిగాం. వైద్య పరీక్షల నిమిత్తం బాలికల్ని ఆరోగ్య కేంద్రానికి పంపించాం’ అని గవర్నర్‌ వెల్లడించారు. 2014 ఏప్రిల్‌లోనూ బోర్నోరాష్ట్రంలో బిబోక్‌ పాఠశాల నుంచి బోకోహరామ్‌ తీవ్రవాదులు 276 మంది బాలికలను అపహరించుకుపోగా వారిలో వంద మంది ఏమయ్యారో ఇంతవరకూ తెలియరాలేదు.

నైజీరియాలోని జాంఫరా రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలపై కొందరు సాయుధులు దాడి చేసి 300 మంది విద్యార్థినులను అపహరించుకుపోయిన విషయం తెలిసిందే. డబ్బుకోసం, జైల్లో ఉన్న తమ వారి విడుదల కోసం ఉగ్రవాదులు ఈ దారుణాలకు పాల్పడుతున్నట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని