Kim Jong un: దేనికైనా సిద్ధంగా ఉండాలి : కిమ్‌

ఉత్తరకొరియా నియంత కిమ్‌జోంగ్‌ ఉన్‌ తొలిసారి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌పై గురిపెడుతూ ప్రకటన చేశారు. ఉత్తర కొరియా చర్చలకైనా, ఘర్షణకైనా సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు

Published : 18 Jun 2021 22:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తరకొరియా నియంత కిమ్‌జోంగ్‌ ఉన్‌ తొలిసారి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌పై గురిపెడుతూ ప్రకటన చేశారు. ఉత్తర కొరియా చర్చలకైనా, ఘర్షణకైనా సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ముఖ్యంగా యుద్ధానికి పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలన్నారు. అమెరికాలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఉత్తర కొరియాతో దౌత్య సంబంధాలను పెట్టుకోవడానికి ప్రయత్నిస్తే కిమ్‌ సర్కారు ఆసక్తి చూపలేదు. తాజాగా తొలిసారి అమెరికాపై కిమ్‌ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రారంభమైన ఉత్తర కొరియా సీనియర్‌ నాయకుల సమావేశంలో కిమ్‌ మాట్లాడారు. ‘‘ముఖ్యంగా పూర్తి స్థాయిలో యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలి. దేశ గౌరవాన్ని, దేశ స్వయం సమృద్ధిని కాపాడటం కోసం ఇది అవసరం. కొరియా ద్వీపకల్పంలో వచ్చే ఎలాంటి సంక్షోభాన్నైనా చురుగ్గా ఎదుర్కొనేలా, పరిస్థితిని వేగంగా అదుపులోకి తీసుకునేలా ఉండాలి ’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కొరియా జాతీయ మీడియా సంస్థ కేసీఎన్‌ఏ ఈ విషయాన్ని వెల్లడించింది. 

 ఇటీవల జరిగిన జీ7 సమావేశంలో బైడెన్‌తో సహా ఇతర నాయకులు ఉత్తర కొరియా అణ్వాయుధాలను, క్షిపణులను త్యజించి.. చర్చలు పునరుద్ధరించాలని పిలుపునిచ్చారు.  దేశంలో ఆహార లభ్యతపై ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని ఆయన అంగీకరించాకనే ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. ఇటీవలే కిమ్‌ జోంగ్‌ ఉన్ దేశంలో ఆహార సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీని నుంచి బయటపడేందుకు ఆహారోత్పత్తులను గణనీయంగా పెంచే మార్గాలను కనుగొనాలని అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్‌ ఆంక్షలు మరికొంతకాలం పొడిగిస్తున్నందున దానికి సిద్ధంగా ఉండాలని అక్కడి ప్రజలకు కిమ్‌ పిలుపునిచ్చారు. కరోనా భయంతో ఉత్తర కొరియా సరిహద్దులను మూసివేయడంతో పాటు కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షలను అమలు చేస్తోంది. ముఖ్యంగా చైనాతోనూ వాణిజ్య కార్యకలాపాలను నియంత్రించింది. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణించినట్లు సమాచారం. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని