Updated : 13/04/2021 16:58 IST

రాత్రి కర్ఫ్యూ.. అమలవుతున్న రాష్ట్రాలివే.. 

దిల్లీ : దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి ప్రమాదకరస్థాయిలో కొనసాగుతోంది. మొదటి దశ కంటే.. రెండో దశలో కేసులు భారీగా నమోదవుతుండటంతో ఆయా రాష్ట్రాలు ఆంక్షలు, లాక్‌డౌన్ల దిశగా కదులుతున్నాయి. కఠిన చర్యలు చేపడుతూ వైరస్‌కు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేస్తున్నాయి.

తాజాగా హరియాణాలో కేసుల సంఖ్య భారీగా పెరగడంతో సోమవారం నుంచి రాత్రి కర్ఫ్యూని ఆ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇక భోపాల్‌లో ఏడు రోజుల రాత్రి కర్ఫ్యూకి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశించింది. సోమవారం నుంచి ఏప్రిల్‌ 19 వరకూ ఇది అమల్లో ఉండనుంది.

దేశవ్యాప్తంగా ఆంక్షలు అమలవుతున్న రాష్ట్రాలివే..

మహారాష్ట్ర

దేశంలో కొవిడ్‌కు ఎక్కువ ప్రభావితమైన రాష్ట్రం మహారాష్ట్రనే. దేశవ్యాప్తంగా నమోదువుతున్న కేసులు, మరణాల్లో దాదాపు సగం ఇక్కడి నుంచే ఉంటున్నాయి.  ఇక్కడ కొన్ని రోజులుగా నిత్యం 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. రోజూ రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తుండగా.. వారాంతాల్లో పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ తీసుకువచ్చింది. పరిస్థితి అదుపులోకి రాకపోతే త్వరలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ దిశగా ఇక్కడ చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

మధ్యప్రదేశ్‌

* సోమవారం నుంచి ఏప్రిల్‌ 19 వరకూ రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ

* బర్వానీ, రాజ్‌గఢ్‌, విదీషా జిల్లాల్లో ఈ నెల 19 వరకూ లాక్‌డౌన్‌

* బాలాఘాట్‌, నర్సింగ్‌పూర్‌, సియోనీ, జబల్‌పూర్‌లో ఏప్రిల్‌ 22 వరకూ 10 రోజుల లాక్‌డౌన్‌

ఉత్తరప్రదేశ్‌

* మథుర, గోరఖ్‌పూర్‌, లఖ్‌నవూ, కాన్పూర్‌, గౌతమ్‌ బుద్ధానగర్‌, అలహాబాద్‌, మేరఠ్‌, ఘజియాబాద్‌, బరేలీ జిల్లాలో రాత్రి కర్ఫ్యూ

కర్ణాటక

* రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో 11 రోజుల రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది. ఏప్రిల్‌ 10 నుంచి 20 వరకూ బెంగళూరు, మైసూర్‌, మంగళూరు, బీదర్‌, తుమకూర్‌, ఉడుపి ప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూ.

దిల్లీ

ఏప్రిల్‌ 30 వరకూ దిల్లీలో రాత్రి కర్ఫ్యూ.

హరియాణా

* రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఆంక్షలు అమల్లో ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

జమ్ముకశ్మీర్‌

* ఎనిమిది జిల్లాల్లో(జమ్ము, శ్రీనగర్‌, ఉధంపూర్‌, బారాముల్లా, కథువా, అనంత్‌నాగ్‌, బుడ్గామ్‌, కుప్వారా) రాత్రి 10 నుంచి ఉదయం 8 గంటల వరకూ కర్ఫ్యూ.

రాజస్థాన్‌ 

అజ్‌మేర్‌‌, అల్వార్‌, భిల్వారా, చిత్తోర్‌గఢ్‌, దుంగార్‌పూర్‌, జైపుర్‌, జోధ్‌పూర్‌, కోటా తదితర ప్రాంతాల్లో ఏప్రిల్‌ 30 వరకూ రాత్రి కర్ఫ్యూ

గుజరాత్‌

జామ్‌నగర్‌, భావ్‌నగర్‌, జునాగఢ్‌, గాంధీనగర్‌, ఆనంద్‌, నదియాడ్‌, మోర్బీ, దహోడ్‌, పఠాన్‌, భుజ్‌, గాంధీధామ్‌, భరూచ్‌, సూరత్‌, అహ్మదాబాద్‌, రాజ్‌కోట్‌, వడోదరలో ఏప్రిల్‌ 30 వరకూ రాత్రి కర్ఫ్యూ 

పంజాబ్‌

రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంది.

ఒడిశా

* సుందర్‌భాగ్‌, ఝార్సుగూడ, సంబల్‌పూర్‌, బర్గాఢ్‌, నౌపడ, కలాహండి, కోరాపుత్‌, మల్కన్‌గిరిలో రాత్రి కర్ఫ్యూ.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని