సుప్రీంను ఆశ్రయించిన మహారాష్ట్ర ప్రభుత్వం

మహారాష్ట్రలో తీవ్ర చర్చనీయాంశమైన రూ.100 కోట్ల వసూళ్ల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలమహారాష్ట్రలో తీవ్ర చర్చనీయాంశమైన రూ.100 కోట్ల వసూళ్ల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల

Updated : 06 Apr 2021 18:21 IST

ముంబయి: మహారాష్ట్రలో రూ.100కోట్ల వసూళ్ల వ్యవహారం మరోసారి సుప్రీం కోర్టుకు చేరింది. మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ వచ్చిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం ఆశ్రయించింది. అనిల్‌ దేశ్‌ముఖ్‌ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయాలని బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించాలని సుప్రీం కోర్టును కోరింది.

మహారాష్ట్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో అనిల్‌ దేశ్‌ముఖ్‌ నెలకు రూ.100కోట్లు వసూలు చేయాలంటూ పోలీస్‌ ఆధికారులను ఆదేశించినట్లు ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా పోలీస్‌ అధికారుల బదిలీల్లోనూ హోంమంత్రి అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ తొలుత ఆయన సుప్రీం కోర్టులను ఆశ్రయించారు. ఆరోపణలు తీవ్రమైనవేనని అభిప్రాయపడిన సుప్రీం ధర్మాసనం, దీనిపై బాంబే హైకోర్టుకు వెళ్లాలని పరంబీర్‌కు సూచించింది. సుప్రీం సూచనల ప్రకారం పరంబీర్‌ బాంబే హైకోర్టులో పిటిషన్‌ వేయగా.. విచారించిన న్యాయస్థానం అనిల్‌ దేశ్‌ముఖ్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. అనంతరం హోంమంత్రి పదవికి అనిల్‌ దేశ్‌ముఖ్‌ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే సీబీఐ దర్యాప్తుపై బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

సీబీఐ దర్యాప్తునకు సహకరిస్తాం..హోంమంత్రి

హోంమంత్రిపై వచ్చిన ఆరోపణల అనంతరం నూతన హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దిలీప్ వాల్సే పాటిల్‌ వీటిపై స్పందించారు. రాష్ట్ర పోలీసుల నమ్మకాన్ని కాపాడుతానని స్పష్టం చేసిన ఆయన.. ఇక నుంచి పోలీసు అధికారుల పాలనా వ్యవహారంలో రాజకీయం జోక్యం ఉండదని హామీ ఇచ్చారు. బాంబే హైకోర్టు ఆదేశాల ప్రకారం, సీబీఐ దర్యాప్తునకు సహకరిస్తామని దిలీప్ వాల్సే పేర్కొన్నారు. ఇదే సమయంలో దీనిపై స్టే విధించాలని రాష్ట్రప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించడం గమనార్హం.

సుప్రీం తలుపుతట్టిన అనిల్‌ దేశ్‌ముఖ్‌..

తనపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేయాలని బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించాలని కోరుతూ మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ వ్యక్తిగతంగా సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇదిలాఉంటే, హోంమంత్రిగా ఉన్న సమయంలో అనిల్‌ దేశ్‌ముఖ్‌పై వచ్చిన ఆరోపణలపై 15రోజుల్లోగా ప్రాథమిక దర్యాప్తు జరపాలని బాంబే హైకోర్టు సీబీఐకి ఆదేశించిన విషయం తెలిసిందే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు