మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామా
మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు ఆయన పంపించారు.
ముంబయి: మహారాష్ట్ర హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన తన రాజీనామా లేఖను సీఎం ఉద్ధవ్‌ఠాక్రేకు పంపించారు. అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణలపై ప్రాథమిక దర్యాప్తు చేయాలంటూ బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించిన నేపథ్యంలో రాజీనామా చేయడం గమనార్హం. నైతికపరమైన కారణాలతో పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ట్విటర్లో పోస్ట్ చేశారు. తనపై విచారణ జరుగుతున్నందున హోంమంత్రి పదవిలో కొనసాగడం ఇష్టంలేదని ముఖ్యమంత్రికి పంపిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. గత కొన్నివారాలుగా తనపై అవినీతి ఆరోపణల్ని ఖండించిన ఆయన రాజీనామా డిమాండ్లను తోసిపుచ్చారు. తానేమీ తప్పుచేయలేదని పేర్కొన్నారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల వాహనం కేసులో అరెస్టయిన సచిన్ వాజేకు దేశ్‌ముఖ్ ప్రతి నెలా రూ.100 కోట్లు వసూళ్లను లక్ష్యంగా పెట్టారంటూ పరమ్‌బీర్ సింగ్ చేసిన ఆరోపణలు మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్‌కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్‌కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని