Published : 07/08/2021 17:21 IST

Mamata letter to modi: విద్యుత్‌ సవరణ బిల్లుపై ప్రధానికి మమత లేఖ

కోల్‌కతా: కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్‌ సవరణ బిల్లు-2020ను వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. విద్యుత్‌ సవరణ బిల్లును ప్రజావ్యతిరేక బిల్లుగా అభివర్ణించారు. బిల్లును ఉపసంహరించుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

గతేడాదే ఈ బిల్లును కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిందని మమత గుర్తుచేశారు. ప్రజావ్యతిరేక విధానాలు కలిగిన ఈ బిల్లును చాలా మంది వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఇదే అంశంపై గతేడాది జూన్‌ 12న సైతం లేఖ రాసినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు అదే బిల్లును మళ్లీ తీసుకురావడంపై మమత అభ్యంతరం వ్యక్తంచేశారు. రాష్ట్రాల విద్యుత్‌ పంపిణీ హక్కులు కేంద్రానికి చేతికి కట్టబెట్టేలా ఉన్న ఈ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. మరోవైపు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీ ఇదివరకే ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని