MI5: ఇక ఉగ్రవాదులు రెచ్చిపోతారు..!

అఫ్గాన్‌ తాలిబన్లకు దక్కడంతో ఉగ్రవాదుల్లో నైతిక స్థైర్యం పెరిగిపోతుందని బ్రిటన్‌ భద్రతా సంస్థ ఎంఐ5 అధినేత కెన్‌ మెక్‌ కల్లమ్‌ హెచ్చరించారు.

Published : 10 Sep 2021 22:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తాలిబన్లు అఫ్గాన్‌ను హస్తగతం చేసుకోవడంతో ఉగ్రవాదుల్లో నైతిక స్థైర్యం పెరిగిపోతుందని బ్రిటన్‌ భద్రతా సంస్థ ఎంఐ5 అధినేత కెన్‌ మెక్‌ కల్లమ్‌ హెచ్చరించారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ అప్గాన్‌లో నెలకొన్న పరిస్థితులతో ఉగ్రవాదుల్లో ధైర్యం పెరిగిపోయి పరిస్థితులు రాత్రికి రాత్రే మారిపోవచ్చని పేర్కొన్నారు. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఉగ్రవాదం నుంచి స్పూర్తిపొందే వారి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత నాలుగేళ్లలో దాదాపు 31 దాడులను చివరి నిమిషంలో తాము భగ్నం చేశామని ఆయన వెల్లడించారు. 

ఒక పక్క కరోనా వ్యాపిస్తున్నా ఉగ్రదాడులకు కుట్రలు జరిగాయని మెక్‌కల్లమ్‌ వివరించారు. ఇలాంటి ఆరు కుట్రలను అడ్డుకొన్నట్లు పేర్కొన్నారు. యూకేకు ఉగ్రముప్పు ఉన్నదని చెబుతున్నందుకు నన్ను క్షమించండి.. కానీ, ఇది వాస్తవం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. లోన్‌ ఉల్ఫ్‌ దాడులు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఒక పక్క బ్రిటన్‌ ప్రభుత్వం తాలిబన్లను  పనితీరు ఆధారంగా అంచనా వేస్తామని చెబుతోంది. మరోపక్క ఎంఐ5 తాలిబన్ల కారణంగా పుట్టుకొచ్చే ఉగ్రముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని