కరోనాతో మిల్కాసింగ్‌ సతీమణి కన్నుమూత

భారత మహిళల వాలీబాల్‌ జట్టు మాజీ కెప్టెన్‌, లెజెండరీ అథ్లెట్‌ మిల్కాసింగ్‌ సతీమణి నిర్మల్‌ కౌర్‌(85) కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు. ఆమె మరణవార్తను కుటుంబసభ్యులు ధ్రువీకరించారు. గతనెలలో కరోనా బారిన పడ్డ మిల్కాసింగ్‌ దంపతులు మే 26న మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరి చికిత్స

Updated : 13 Jun 2021 23:34 IST

మొహాలీ: భారత మహిళల వాలీబాల్‌ జట్టు మాజీ కెప్టెన్‌, లెజెండరీ అథ్లెట్‌ మిల్కాసింగ్‌ సతీమణి నిర్మల్‌ కౌర్‌(85) కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు. ఆమె మరణవార్తను కుటుంబసభ్యులు ధ్రువీకరించారు. గతనెలలో కరోనా బారిన పడ్డ మిల్కాసింగ్‌ దంపతులు మే 26న మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో నిర్మల్‌ కౌర్‌ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె చివరిశ్వాస విడిచారు. కాగా కరోనా నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన మిల్కాసింగ్‌   న్యుమోనియాతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన చండీగఢ్‌లోని జిప్‌మర్‌ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిర్మల్‌ కౌర్‌ అంత్యక్రియలకు ఆయన రాలేని పరిస్థితి నెలకొంది. మిల్కాసింగ్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. మిల్కాసింగ్‌-నిర్మల్‌ కౌర్‌ దంపతులకు ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని