ప్రజలకు ప్రముఖుల శ్రీరామనవమి శుభాకాంక్షలు
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలందరిపైనా ఆ శ్రీరాముడి కృప ఉండాలని ఆకాంక్షించారు.
దిల్లీ: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా పలువురు ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలందరిపైనా ఆ శ్రీరాముడి కృప ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్విటర్ ద్వారా తెలియజేశారు. ‘ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. దేశ ప్రజలందరిపై ఆ శ్రీరామచంద్రుడి కృప ఉండాలి. మర్యాద పురుషోత్తముడైన ఆయన సందేశాన్ని అందరూ అనుసరించాలి. కరోనా సంక్షోభం నెలకొన్న ఈ సందర్భంలో అందరూ జాగ్రత్త చర్యలు పాటించండి’ అని మోదీ ట్వీట్లో వెల్లడించారు.
రాముడి జీవితం స్ఫూర్తిదాయకం: రాష్ట్రపతి
‘అందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. పురుషోత్తముడైన రాముడి జీవితం అందరికీ స్ఫూర్తి దాయకం. ఈ సందర్భంగా మనందరం కొవిడ్-19 మహమ్మారిని ఓడిద్దామని ప్రతిజ్ఞ చేద్దాం’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్లో పేర్కొన్నారు.
శ్రీరాముడు ఆదర్శప్రాయుడు: జగన్
శ్రీరామనవమి పండుగ పురస్కరించుకొని ఏపీ సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, ధర్మం, న్యాయం మార్గాలుగా సర్వమానవ సంక్షేమ పాలన సాగించిన పరమ పావనమూర్తి శ్రీరామచంద్రుడు అని జగన్ అన్నారు. కష్టనష్టాల్లోనూ ఒకే మాట ఒకే బాటగా సాగిన జగదభిరాముడు మనకు ఆదర్శప్రాయుడని తెలిపారు. పుణ్య దంపతులు సీతారాముల కల్యాణం ఈ లోకానికి పండుగ రోజు అని జగన్ ట్వీట్ చేశారు.
ప్రజలు సుఖసంతోషాలతో వర్థిల్లాలి: కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ తెలుగు ప్రజలకు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖసంతోషాలతో వర్థిల్లాలని, రాముడి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.
శ్రీరాముడు సుగుణాలకు ప్రతిరూపం: చంద్రబాబు
తెలుగు వారందరికీ తెదేపా అధినేత చంద్రబాబు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడంటే మనిషిలోని సుగుణాలకు ప్రతిరూపమన్నారు. ప్రజలకు మంచిని చేయాలనే చిత్తశుద్ధి కలిగిన వాడు, తన కుటుంబ సౌఖ్యం కంటే ప్రజల ఆనందమే ముఖ్యమని భావించేవాడు పాలకుడిగా ఉంటే అది ఎప్పటికీ రామరాజ్యమే అవుతుందని చంద్రబాబు ట్వీట్ ద్వారా వివరించారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కూడా తెలుగు ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడు సామాన్యులు, శరణు కోరిన వారి పట్ల శాంతస్వభావిగా.. అవసరమైనప్పుడు దుర్మార్గులను కఠినంగా శిక్షించాడని రామకథ ద్వారా పెద్దలు చెప్పినట్లు లోకేశ్ ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్‌ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్‌కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్‌ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్‌ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్‌లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్‌లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్‌ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్‌లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్‌కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్‌కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్‌గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్‌కు భారత్ విజ్ఞప్తి