Australia: వ్యాక్సిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌.. పరిహారానికి ఫిర్యాదుల వెల్లువ!

ఇటీవల డెల్టా వేరియంట్‌తో అతలాకుతలమైన ఆస్ట్రేలియాలో తాజాగా పరిస్థితులు నియంత్రణలోకి వచ్చిన విషయం తెలిసిందే. మొదట్లో భారీ ఎత్తున కేసులతో సిడ్నీ, మెల్‌బోర్న్‌ తదితర నగరాలు నెలల తరబడి లాక్‌డౌన్‌లో ఉండిపోయాయి. అయితే, వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ముమ్మరం...

Published : 16 Nov 2021 14:02 IST

కాన్‌బెర్రా: ఇటీవల డెల్టా వేరియంట్‌తో అతలాకుతలమైన ఆస్ట్రేలియాలో తాజాగా పరిస్థితులు నియంత్రణలోకి వచ్చిన విషయం తెలిసిందే. మొదట్లో భారీ ఎత్తున కేసులతో సిడ్నీ, మెల్‌బోర్న్‌ తదితర నగరాలు నెలల తరబడి లాక్‌డౌన్‌లో ఉండిపోయాయి. అయితే, వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ముమ్మరం చేయడంతో.. క్రమంగా నిబంధనలు సడలిస్తున్నారు. అంతర్జాతీయ రాకపోకలకూ అనుమతులు ఇచ్చారు. మరోవైపు వ్యాక్సినేషన్‌ కారణంగా తాము ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్లు వేల సంఖ్యలో ఆస్ట్రేలియన్లు ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తున్నారు. పరిహారం చెల్లించాలంటూ తమ ఫిర్యాదులు నమోదు చేస్తున్నారు. దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వంపై దాదాపు రూ.275.36 కోట్ల భారం పడనున్నట్లు స్థానికంగా ఓ వార్తాసంస్థ కథనం వెలువరిచింది.

ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం..

టీకా దుష్ర్పభావాల కారణంగా ఆసుపత్రి పాలయ్యి.. ఆదాయం కోల్పోయిన వారికి పరిహారం చెల్లించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం స్థానికంగా ఓ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఒక్కొక్కరికి రూ.5.46 లక్షలు మొదలు ఆపై మొత్తంలో పరిహారం చెల్లిస్తామని ప్రకటించింది. దీనికి ఇప్పటివరకు 10 వేల మందికి పైగా నమోదు చేసుకున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన డ్రగ్‌ రెగ్యులేటర్‌ ‘థెరప్యూటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్(టీజీఏ)’ వెబ్‌సైట్ వివరాల ప్రకారం.. 36.8 మిలియన్ డోసులకు సంబంధించి దాదాపు 79 వేల సైడ్‌ ఎఫెక్ట్స్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో చాలావరకు చేయి నొప్పి, తలనొప్పి, జ్వరానికి సంబంధించినవే. ఫైజర్ టీకా కారణంగా గుండె మంట సమస్య ఏర్పడినట్లు 288, అలాగే ఆస్ట్రాజెనెకా కారణంగా రక్తం గడ్డకట్టిందంటూ 160 వరకు కేసులు నమోదయ్యాయి. వ్యాక్సినేషన్‌కు సంబంధించి తొమ్మిది మరణాలూ నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని