కొవిడ్‌ జయించినా.. బ్లాక్‌ఫంగస్‌ బలితీసుకుంది

ఔషధాల కొరత కారణంగా రోగులను ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి ప్రైవేటుకి తరలించినా పరిస్థితి అందుబాటులోకి రాలేదు

Updated : 12 Jul 2021 16:53 IST

కర్ణాటకలో 303 మంది మృతి

బెంగళూరు: దేశంలో గణనీయంగా కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అదేవిధంగా కరోనా వైరస్‌ని జయించిన వారి సంఖ్య పెరుగుతున్న తరుణంలో బ్లాక్‌ ఫంగస్‌ మాత్రం ప్రాణాలను బలి తీసుకుంటోంది. తాజాగా కర్ణాటకలో 303 మంది కరోనా నుంచి కోలుకున్నా.. వెంటనే బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడి మరణించడం కలవరపెడుతోంది. ఇందులో 104 కేసులు కేసులు కేవలం బెంగళూరు నుంచే నమోదయ్యాయి. పలు నివేదికల ప్రకారం.. మే, జూన్‌ నెలలో యాంటీ ఫంగల్‌ ఔషధాల కొరత పెరిగిందని వెల్లడైంది. దీంతో 2-3 రోజులకు ఇవ్వాల్సిన ఒక డోసు మందు  5-6 రోజులకు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. ఔషధాల కొరత కారణంగా రోగులను ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి ప్రైవేటుకి తరలించినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఇలా జరిగిందని వైద్యులు పేర్కొన్నారు. కాగా ఆదివారం ఒక్కరోజే 433 మంది వైరస్‌ బారిన పడగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 13,459కు చేరింది. 203 మంది కోలుకోగా.. రికవరీ సంఖ్య 11లక్షలకు చేరుకుంది.

ఊపిరితిత్తులపై బ్లాక్‌ఫంగస్‌ ప్రభావం ఎక్కువ: ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా

సరైన సమయంలో వైద్యం అందించకపోతే ఊపిరితిత్తులకు బ్లాక్‌ఫంగస్‌ చేరి ప్రాణాలు బలితీసుకునే ప్రమాదం వందశాతం ఉందని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్ గులేరియా తెలిపారు. ముఖ్యంగా స్టెరాయిడ్స్‌ దుర్వినియోగం, అలాగే డెల్టా వేరియంట్‌ ప్రభావం కారణంగానూ బ్లాక్‌ఫంగస్‌ సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని