Published : 02/04/2021 19:33 IST

మయన్మార్: పిల్లల్ని ఇళ్లలోనే చంపేస్తున్నారు

సైన్యం క్రూరత్వాన్ని ఖండించిన అంతర్జాతీయ సమాజం 

యాంగూన్: రెండు నెలల క్రితం మయన్మార్‌లో మొదలైన సైనిక తిరుగుబాటు.. తీవ్ర రక్తపాతానికి దారి తీస్తోంది. తమను వ్యతిరేకించిన వారిపై సైన్యం కర్కశంగా ప్రవర్తిస్తూ.. కనిపించినవారిని కనిపించినట్లే కాల్చివేస్తోంది. ఇప్పటివరకూ జరిగిన పలు ఘటనల్లో 40 మందికి పైగా చిన్నారులు మరణించడంతో పాటు.. వందల సంఖ్యలో ప్రజలు కనిపించకుండా పోయారు. దాంతో మయన్మార్ మిలిటరీపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 

ఇప్పటివరకు 44 మంది చిన్నారులతో సహా 543 మంది పౌరులు మరణించారని అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్(ఏఏపీపీ) లెక్కగట్టింది. సైన్యం సుమారు 2,700 మందిని బలవంతంగా అదుపులోకి తీసుకుందని తెలిపింది. కొద్ది వారాలుగా హింస మరింత తీవ్రమైందని, గత 12 రోజుల్లో చిన్నారుల మరణాలు రెట్టింపయ్యాయని సేవ్‌ ది చిల్డ్రన్ ఆవేదన వ్యక్తం చేసింది. ‘చిన్నారులను ఈ దాడుల నుంచి రక్షించమని పదేపదే చెబుతున్నప్పటికీ..ఈ ప్రాణాంతక దాడుల్లో వారే సమిధలవుతుండటం తీవ్రంగా బాధిస్తోంది. వీరిలో చాలా మంది ఇళ్లల్లోనే ప్రాణాలు కోల్పోవడం అత్యంత దారుణం’ అంటూ పిల్లల పట్ల మయన్మార్ సైన్యం క్రూరత్వాన్ని కళ్లకుగట్టింది. 

అలాగే ప్రజాస్వామ్య అనుకూల నిరసనలకు మద్దతు ఇస్తున్నారనే అనుమానం ఉన్న వ్యక్తుల ఇళ్లపై సైన్యం రాత్రుళ్లు దాడులు జరుపుతోందని, వారిని బలవంతంగా కనిపించకుండా చేస్తోందని హ్యూమన్ రైట్స్ వాచ్ ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే వారు ఎక్కడున్నారో చెప్పేందుకు, న్యాయ సహాయం అందించేందుకు సైన్యం నిరాకరిస్తోందని వెల్లడించింది. ‘ఏకపక్ష అరెస్టులు, బలవంతపు అదృశ్యాలు.. సైన్యం తిరుగుబాటును వ్యతిరేకించే వారిలో భయాన్ని నింపేందుకే’ అని హ్యూమన్ రైట్స్ వాచ్ ఆసియా డైరెక్టర్ బ్రాడ్ ఆడమ్స్ వ్యాఖ్యానించారు. ఆ సైనిక నేతల లక్ష్యంగా ఆర్థికపరమైన ఆంక్షలు విధించాలని అంతర్జాతీయ సమాజాన్ని ఆడమ్స్ అభ్యర్థించారు. 

కమ్యూనికేషన్ వ్యవస్థపై ఆంక్షలు..

శాంతియుత నిరసనకారులపై మయన్మార్ సైన్యం క్రూరంగా వ్యవహరించడంపై అంతర్జాతీయంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. వేగంగా క్షీణిస్తోన్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ..ఐరాస భద్రతా మండలి సైన్యం చర్యలను ఖండించింది. సైన్యంలోని కీలక వ్యక్తుల వ్యాపార ప్రయోజనాలే లక్ష్యంగా బ్రిటన్ మరోదఫా ఆంక్షలు విధించింది. అయితే ఈ చర్యలేవీ సైన్యంపై పని చేస్తున్నట్లు కనిపించడం లేదు. ఇదిలా ఉండగా.. స్థానిక మీడియా కథనం ప్రకారం ..శుక్రవారం కూడా ప్రజలు తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. మరణించినవారికి గుర్తుగా యాంగూన్‌లోని బస్‌స్టాపులు, ఇతర ప్రదేశాల్లో ప్రజలు పూలు వదిలివెళ్తున్నారు. నిరసనలను ఎక్కడికక్కడే కట్టడి చేసేందుకు కమ్యూనికేషన్ సేవలను మూసివేసేలా ఆదేశాలు ఇచ్చింది. 

సూకీపై మరో నేరం మోపిన సైన్యం..
రహస్య చట్టాలను ఉల్లఘించారనే ఆరోపణలతో పౌర నేత ఆంగ్‌ సాన్‌ సూకీపై సైన్యం మరో క్రిమినల్ నేరాన్ని మోపింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమెను న్యాయస్థానం ముందు హాజరుపరిచి, విచారణ జరుపుతోంది. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని