NASA: భూమికి 410కి.మీ ఎత్తులో.. అద్భుత దృశ్యం

అంతరిక్షంలో మనిషి కదలిక ఎప్పుడూ ఆసక్తికరమే. అంతరిక్ష యాత్ర, స్పేస్‌వాక్‌..ఇలా ప్రతి ప్రయాణమూ మనకు అబ్బురమే.

Updated : 26 Jun 2021 13:10 IST

షేర్ చేసిన అమెరికా అంతరిక్ష సంస్థ

వాషింగ్టన్: అంతరిక్షంలో మనిషి కదలిక ఎప్పుడూ ఆసక్తికరమే. అంతరిక్ష యాత్ర, స్పేస్‌వాక్‌.. ఇలా ప్రతి ప్రయాణమూ మనకు అబ్బురమే. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) షేర్‌చేసిన వీడియో ఆ కోవలోనిదే. భూమికి 410 కిలోమీటర్ల ఎత్తులో నుంచి తీసిన ఓ అద్భుత దృశ్యాన్ని నాసా నెటిజన్లతో పంచుకుంది. ఇద్దరు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో విద్యుత్‌ సరఫరాను మెరుగుపర్చే సమయంలో తీసిన వీడియో అది. 

‘భూమికి 255 మైళ్ల(410 కిలోమీటర్లు)ఎత్తులో తీసిన ఈ దృశ్యం ఎలా ఉంది? వ్యోమగాములు థామస్ పిస్వ్కెట్, షేన్‌ కింబ్రౌ అంతరిక్ష కేంద్రంలో విద్యుత్‌ సరఫరాను మెరుగుపర్చుతున్నారు. మీ ఇద్దరు మీ పని కొనసాగించండి’ అంటూ వారు మరమ్మతులు చేస్తోన్న వీడియోను నాసా ట్వీట్ చేసింది. ఆ వీడియోలో ఒకరు అంతరిక్షంలో కదలాడుతూ తన పనిచేసుకుపోతున్నారు. తెల్లటి స్పేస్ సూట్ ధరించిన ఆ వ్యోమగామి కాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. దాంతో కొద్దిసేపు చూసిన తర్వాతే ఆయన ఎక్కడున్నారో గుర్తించగలిగేలా ఉందా దృశ్యం. ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని