NASA: అంగారకుడిపై చక్కర్లు కొట్టిన హెలికాప్టర్‌

అంగారక గ్రహంపై జీవం, పుట్టుకను తెలుసుకునేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) పంపిన పర్సెవరెన్స్‌ రోవర్‌ విజయవంతంగా పనిచేస్తోంది. రోవర్‌తోపాటు అంగారకుడిపైకి శాస్త్రవేత్తలు పంపిన ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్‌ ఇప్పుడు స్వేచ్ఛగా తిరుగుతోంది....

Published : 09 May 2021 00:58 IST

వాషింగ్టన్‌: అంగారక గ్రహంపై జీవం, పుట్టుకను తెలుసుకునేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) పంపిన పర్సెవరెన్స్‌ రోవర్‌ విజయవంతంగా పనిచేస్తోంది. రోవర్‌తోపాటు అంగారకుడిపైకి శాస్త్రవేత్తలు పంపిన ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్‌ ఇప్పుడు స్వేచ్ఛగా తిరుగుతోంది. అంగారకుడిపై తీసిన ఫొటోలు, వీడియోలు ఇప్పటికే పంపించగా.. తాజాగా ఆ హెలికాప్టర్ చేసిన శబ్దాన్ని కూడా రోవర్‌ రికార్డు చేసింది. హెలికాప్టర్‌పై నిర్వహించిన నాలుగో టెస్టులో భాగంగా ఈ శబ్దాన్ని రికార్డు చేసింది. 

శనివారం ఐదో పరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో.. దాదాపు మూడు నిమిషాల నిడివి గల వీడియోను నాసా పంచుకుంది. నిమిషానికి 2,500 సార్లు హెలికాప్టర్‌ బ్లేడ్లు తిరిగినట్లు నాసా పేర్కొంది. 1.8 కేజీల బరువుగల ఈ హెలికాప్టర్‌.. పెర్సెవరెన్స్​ రోవర్​ మైక్రోఫోన్​కు కాస్త దూరంలో ఉండటం, బలమైన గాలుల కారణంగా ఆ శబ్దంలో స్పష్టత లేదని నాసా భావిస్తోంది. మొత్తం 260 మీటర్ల దూరం ఈ హెలికాప్టర్‌ ప్రయాణించి కిందికి దిగింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని