Night Curfew: తమిళనాడు, బిహార్‌ నిర్ణయం

తమిళనాడు, బిహార్‌లలో రాత్రి కర్ఫ్యూ విధిస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి

Updated : 18 Apr 2021 19:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి తమిళనాడు, బిహార్‌ వచ్చి చేరాయి. తమిళనాడులో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4గంటల వరకూ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ప్రజా, ప్రైవేటు రవాణా, ఆటోలు, ట్యాక్సీలు ఏవీ తిరగడానికి వీల్లేదు. ఆదివారం పూర్తి లాక్‌డౌన్‌ విధించారు.

ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి బీచ్‌లు, పార్క్‌ల్లోకి ప్రజలకు అనుమతి లేదు. కరోనా కేసులు పెరుగుతుండటంతో 12వ తరగతి పరీక్షలు వాయిదా వేశారు. నీలగిరి, కొడైకెనాల్‌ సహా పలు పర్యాటక ప్రాంతాల్లోకి ఎవరినీ అనుమతించమని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

బిహార్‌దీ అదే బాట

బిహార్‌లో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ తెలిపారు. రాత్రి 9గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగనుంది. పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్‌ సెంటర్లను మే 15వ తేదీ వరకూ మూసి వేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఆలయాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు సైతం మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మూడోవంతు ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరు కావాలని స్పష్టం చేశారు. దుకాణాలు, మండీలు, వ్యాపార సంస్థలు సైతం సాయంత్రం 6దాటిన తర్వాత మూసివేయాల్సిందిగా ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని