ఈ ఏడాది కూడా రథయాత్ర లేదు

భక్తులందరూ తమ ఇళ్లల్లోనే జగ్ననాథుడి ప్రార్థనలు జరపాలి

Published : 12 Jul 2021 16:52 IST

 ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ 

రాంచీ: ఏటా ఎంతో సందడిగా నిర్వహించే రథయాత్ర కొవిడ్‌ కారణంగా ఈ ఏడాది నిర్వహించడం లేదంటూ ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. ‘‘ గతేడాది కరోనా ఉద్ధృతితో రథయాత్ర వాయిదా పడింది. ఈసారీ అదే పరిస్థితి ఉండటంతో రథయాత్రకు అనుమతి ఇవ్వడం లేదు. రేపటి మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం. భక్తులందరూ తమ ఇళ్లల్లోనే జగ్ననాథుడి ప్రార్థనలు జరపాలంటూ సీఎం హేమంత్‌ విజ్ఞప్తి చేశారు. కాగా ఇప్పటి వరకూ ఝార్ఖండ్‌లో 3,46,279 కేసులు నమోదు కాగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 423. కొవిడ్‌ నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,40,737. 5119 మందిని వైరస్‌ వల్ల మృత్యువాతపడ్డారు.

రథయాత్ర శుభాకాంక్షలు: ప్రధాని నరేంద్ర మోదీ

‘‘ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని మోదీ జగ్ననాథుడిని ప్రార్థిస్తున్నా. మీ అందరికీ రథయాత్ర శుభాకాంక్షలు. జై జగ్ననాథ్‌’’ అంటూ ప్రధాని మోదీ ట్విట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని